Begin typing your search above and press return to search.

నాగశౌర్య మూవీ ఫస్ట్‌ లుక్‌ కు ముహూర్తం ఖరారు

By:  Tupaki Desk   |   10 Nov 2020 4:30 PM GMT
నాగశౌర్య మూవీ ఫస్ట్‌ లుక్‌ కు ముహూర్తం ఖరారు
X
యంగ్‌ హీరో నాగశౌర్య.. రీతూ వర్మ జంటగా రూపొందుతున్న సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఈమద్య కాలంలో వరుసగా సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కిస్తున్న సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. గత నెలలోనే షూటింగ్‌ ప్రారంభం అయినప్పటికి శరవేగంగా షూటింగ్‌ జరుగుతుండటంతో సినిమా ఫస్ట్‌ లుక్‌ వీడియోను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఈనెల 13వ తారీకున దీపావళి సందర్బంగా ఈ సినిమా నుండి అప్‌ డేట్‌ రాబోతుంది.

నటుడిగా సినిమా సినిమాకు మంచి పేరు తెచ్చకుంటూ తన ప్రతిభ చాటుకుంటున్న నాగశౌర్య ఈ సినిమాతో మరింతగా తన నటన పరిణితి చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి టాక్‌ ఉంది. ఈయన కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుందేమో అంటూ అన్ని వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్‌ ను ఈనెల 13న ఫస్ట్‌ గ్లిమ్స్‌ తో పాటు అనౌన్స్‌ చేస్తారా అనేది చూడాలి.