Begin typing your search above and press return to search.

అశ్వథ్థామ పేరు వెనుక అసలు విషయం అదేనట

By:  Tupaki Desk   |   29 Jan 2020 10:00 AM IST
అశ్వథ్థామ పేరు వెనుక అసలు విషయం అదేనట
X
ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ అశ్వథ్థామ. శుక్రవారం వస్తున్నంతనే కొత్త సినిమాలు రిలీజ్ కావటం కామనే అయినా.. అశ్వథ్థామ అందుకు కాస్త మినహాయింపుగా చెప్పాలి. తనకు అలవాటైన జోనర్ ను వదిలేసి.. భిన్నమైన జోనర్ ను ట్రై చేస్తున్నాడు నాగశౌర్యం. దీంతో.. ఈ సినిమాపై ఆసక్తి వ్యక్తమవుతోంది. సమకాలీన ప్రపంచంలో చాలామందికి ఎదురయ్యే అంశాలతో ఈ సినిమా ఉంటుందని.. సీరియస్ గా ఈ సినిమా చేసినట్లుగా చెబుతున్నారు.

నాగశౌర్య ఏ సినిమా అయినా చేయగలడని నిరూపించుకునేందుకే తానీ సినిమా చేసినట్లుగా చెప్పారు. ఇంతకీ ఈ సినిమా పేరు అశ్వథ్థామ అని ఫిక్స్ చేయటం వెనుక కారణాన్ని చెబుతూ.. ద్రౌపది చీర లాగుతున్నప్పుడు అందరూ వినోదం చూస్తే.. అశ్వథ్థామ ఒక్కడే ప్రశ్నించాడని.. ఆ ప్రశ్నించే గుణంలోనుంచే ఈ కథ పుట్టినట్లు చెప్పారు.

అమ్మాయిల మీద జరుగుతున్న ఆరాచకాల్ని ఎదురొడ్డే కుర్రాడే కథే ఇదన్న ఆయన.. ఈ రోజున పేపర్ చూస్తే.. ఏదో ఒక వార్త కదిలిస్తోందని.. ఈ మధ్యన దిశ ఘటన అలాంటిదేనని చెప్పిన నాగశౌర్య.. ఇలాంటి అన్యాయాలు ఎన్ని జరుగుతున్నాయన్న ప్రశ్నతోనే చేసినట్లు చెప్పాడు. తన స్నేహితుడి జీవితంలో జరిగిన ఘటన ఒకటి చాలా కదిలించిందని.. అది తెలిసిన వెంటనే.. ఇలాక్కూడా జరుగుతుందా? అని ఆశ్చర్యపోతారని.. ఈ సినిమాతో ఆ విషయాన్ని అందరికి చెప్పాలనుకుంటున్నట్లు చెప్పాడు నాగశౌర్య.