Begin typing your search above and press return to search.
ల్యాండ్ మార్క్ సినిమాని అలా పరిగెట్టించిన హీరో
By: Tupaki Desk | 12 Oct 2020 1:30 PM ISTయంగ్ హీరో నాగశౌర్య దూకుడు గురించి చెప్పాల్సిన పనే లేదు. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న హీరోల జాబితాలో శౌర్య పేరు ఇప్పటికే చేరింది.
ఇటీవల నాగశౌర్య పూర్తిగా శైలి మార్చేశాడు. మునుపటిలా చాక్లెట్ బోయ్ లవర్ బోయ్ లా కాకుండా రఫ్ గా తయారవుతున్నాడు. మాస్ స్క్రిప్టుల కోసం సాహసాలు చేస్తున్నాడు. తాజా చిత్రంలో కండలు మెలితిప్పి 8 ప్యాక్ లతో సర్ ప్రైజ్ చేయనున్నాడు. ఇప్పటికే అతడి లుక్ కూడా వైరల్ అయ్యింది. గడ్డం మీసకట్టు తీరు మార్చి కూడా షాకిచ్చాడు. ఇదంతా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా కోసమే. కెరీర్ 20 వ చిత్రం కోసం నాగ శౌర్య చాలా సాహసాలే చేస్తున్నాడు. పూర్తిగా భిన్నమైన రూపంతో కనిపిస్తున్నాడు. ఇందులో నాగ శౌర్య రెండు విభిన్న రూపాల్లో కనిపించనున్నాడు. అతను గడ్డం లుక్ కి సంబంధించిన షూట్ ను పూర్తి చేసి వేరొక గెటప్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి లక్ష్మి సౌజన్యతో కలిసి తన మరో చిత్రం షూటింగ్ ను తిరిగి ప్రారంభించారని తెలుస్తోంది. నిజానికి ఈ మూవీ చిత్రీకరణ లాక్ డౌన్ ముందు మొదలైంది. ``అవసరమైన అన్ని భద్రతా చర్యలతో హైదరాబాద్ లో ప్రొడక్షన్ నెంబర్ 8 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది! కోవిడ్ రూల్స్ తో సేఫ్ గా మొదలెట్టాం. ఇందులో రీతు వర్మ నాయిక`` అని శౌర్య నిర్మాతలు వెల్లడించారు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.