Begin typing your search above and press return to search.

ఫ్రైడే వచ్చింది.. శౌర్య 'లక్ష్య' వర్కింగ్ స్టిల్స్ వచ్చాయి..!

By:  Tupaki Desk   |   6 Aug 2021 8:30 AM GMT
ఫ్రైడే వచ్చింది.. శౌర్య లక్ష్య వర్కింగ్ స్టిల్స్ వచ్చాయి..!
X
ఇండియాలో ప్రాచీన విలువిద్య (ఆర్చరీ క్రీడ) నేపథ్యంలో రూపొందుతున్న మొట్ట మొదటి స్పోర్ట్స్ డ్రామా ''లక్ష్య''. ఇందులో యంగ్ హీరో నాగ శౌర్య - కేతిక శర్మ జంటగా నటిస్తున్నారు. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో #LAKSHYASFRIDAY పేరుతో చిత్ర బృందం ప్ర‌తీ శుక్ర‌వారం ఓ అప్డేట్ ను అందిస్తూ ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా 'లక్ష్య' వర్కింగ్ స్టిల్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు - దర్శకుడు సీన్స్ గురించి డిస్కషన్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. నాగ శౌర్య డిఫరెంట్ హెయిర్ స్టైల్ - గడ్డంతో స్టైలిష్ గా ఉన్నాడు. ఇంత‌కు ముందెన్న‌డూ కనిపించని యువ హీరో స‌రికొత్త‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా శౌర్య చేతి మీద ఉన్న టాటూ స్పెషల్ అటాక్షన్ గా నిలిచింది.

నాగ శౌర్య కెరీర్ లో మైలురాయి 20వ చిత్రంగా వస్తున్న 'లక్ష్య' పై ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతి బాబు - సచిన్ కేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

'లక్ష్య' సినిమా సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రూపొందుతోంది. నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.