Begin typing your search above and press return to search.

ఆ సినిమా మళ్లీ వాయిదా

By:  Tupaki Desk   |   17 Feb 2018 7:36 AM GMT
ఆ సినిమా మళ్లీ వాయిదా
X
‘ఫిదా’ సినిమాతో ఓవర్ నైట్ తెలుగులో స్టార్ అయిపోయిన హీరోయిన్ సాయిపల్లవి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం ‘కణం’. టాలీవుడ్ యువ కథానాయకుడు నాగశౌర్య ఈ చిత్రంలో సాయిపల్లవికి జోడీగా నటించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 9నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. చాన్నాళ్ల కిందటే డేట్ ఇచ్చారు. కానీ కారణాలేంటో తెలియదు కానీ.. ఫిబ్రవరి 23కు ఈ సినిమాను వాయిదా వేశారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆ రోజు కూడా ప్రేక్షకుల ముందుకు రాదట. దీన్ని మార్చికి వాయిదా వేసినట్లు సమాచారం. నిజానికి వచ్చే వారాంతంతో తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కావట్లేదు. ‘కణం’ను రిలీజ్ చేస్తే అదే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. కానీ ఈ సినిమాను ఎందుకు వాయిదా వేశారో తెలియదు.

సాయిపల్లవి వరుసగా ‘ఫిదా’.. ‘ఎంసీఏ’ లాంటి హిట్లతో ఊపుమీదుంది. నాగశౌర్య కూడా ‘ఛలో’ విజయంతో జోరుమీదున్నాడు. ఇలాంటి సమయంలో వీళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాను సరిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే మంచి ఫలితమే ఉంటుంది. కానీ ట్రైలర్ లాంచ్ తర్వాత ఈ సినిమా గురించి అసలేమాత్రం ప్రమోషనే లేదు. ‘నాన్న’ సినిమా తీసిన ఎ.ఎల్.విజయ్ రూపొందించిన చిత్రమిది. ‘2.0’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.