Begin typing your search above and press return to search.

నాగశౌర్య ఎంత మంచోడంటే!!

By:  Tupaki Desk   |   15 Feb 2018 4:48 AM GMT
నాగశౌర్య ఎంత మంచోడంటే!!
X
ఓ కథను నమ్మి సినిమా నిర్మించేయడం.. మన టాలీవుడ్ హీరోలలో అతి కొద్ది మంది మాత్రమే చేసే విషయం. రీసెంట్ గా ఛలో మూవీని అలాగే నిర్మించాడు నాగశౌర్య. ఈ యంగ్ హీరో నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతూ ఇంకా పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది.

వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఛలో.. నాగశౌర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నిర్మాత కం హీరో నాగశౌర్య. ఇప్పటికే వైజాగ్ లో సక్సెస్ మీట్ నిర్వహించిన ఈ హీరో.. త్వరలోనే యూనిట్ కోసం ఓ పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయనున్నాడట. ఛలోకు వర్క్ చేసిన ప్రతీ ఒక్కరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారట. అంతే కాదు.. ప్రతీ ఒక్కరికి వారి వారి స్థాయి.. కంట్రిబ్యూషన్ కు తగినట్లుగా బహుమతులు కూడా అందించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గిఫ్టుల షాపింగ్ కూడా పూర్తయిపోయిందని అంటున్నారు.

దర్శకుడు వెంకీ కుడుములకు ఓ కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇవ్వనున్నాడట నాగశౌర్య. ఇప్పటికే ఈ దర్శకుడికి ఇచ్చే కారును బుక్ చేసేశారని అంటున్నారు. సక్సెస్ ఈవెంట్ లో ఈ కారును ప్రజెంట్ చేయనున్నారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా వ్యక్తి అయిన వెంకీ కుడుముల.. గతంలో తేజ..త్రివిక్రమ్ వంటి దర్శకుల దగ్గర వర్క్ చేశాడు. ఛలో చిత్రం ద్వారా దర్శకుడిగా అరంగేట్రంలోనే మంచి సక్సెస్ సాధించాడు.