Begin typing your search above and press return to search.

నాగ శౌర్య అమ్మమ్మగారిల్లు చూశారా!!

By:  Tupaki Desk   |   13 Feb 2018 9:19 AM GMT
నాగ శౌర్య అమ్మమ్మగారిల్లు చూశారా!!
X
ఊహలు గుసగుసలాడే సినిమాతో కథనాయకుడిగా పరిచయం అయిన యంగ్ హీరో నాగ శౌర్య మొదటి సినిమాతోనే అందరిని ఆకర్షించాడు. అయితే ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా విజయాలు అందుకోలేదు. ఫ్యామిలీ కథలు ఆడియెన్స్ ని బాగానే ఆకట్టుకున్నప్పటికి అనుకున్నంత రేంజ్ లో గుర్తింపు రాలేదు. కానీ ఎవరు ఉహించని విధంగా 2018 కుర్ర హీరోకు బాగా కలిసొచ్చింది.

ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక అసలు విషయంలోకి వస్తే.. అంతకుముందే నాగ శౌర్య ఒకే చేసిన ఒక సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఓయ్ సినిమాతో అప్పట్లో అందరిని తన సింపుల్ నటనతో ఆకర్షించిన షాలిని చాలా రోజుల తరువాత టాలీవుడ్ లో తన రెండవ సినిమాను చేయడానికి సిద్ధమైంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అమ్మమగారిల్లు అనే టైటిల్ ను సెట్ చేశారు.

సుందర్ సూర్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా రసూల్ ఎల్లోర్ - కళ్యాణ్ రమణ వంటి టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. కొన్ని కీలకమైన సన్నివేశాలు ఫినిష్ చేస్తే పూర్తయినట్టే. సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.