Begin typing your search above and press return to search.

లీక్‌ః థ్యాంక్యూలో చైతూ ఇలా

By:  Tupaki Desk   |   30 Dec 2020 4:15 AM GMT
లీక్‌ః థ్యాంక్యూలో చైతూ ఇలా
X
నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ'థ్యాంక్యూ'. ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య మొదటి సినిమా జోష్‌ ను నిర్మించిన దిల్‌ రాజు మళ్లీ ఇన్ని సంవత్సరాలకు చైతూతో సినిమాను నిర్మిస్తున్నాడు. వీరిద్దరి కాంబో చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమా మరో ప్రత్యేకత ఏంటీ అంటే కథను బివిఎస్‌ రవి అందించగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కెరీర్‌ లో మొదటి సారి తన కథను కాకుండా మరో రచయిత కథను విక్రమ్‌ కుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు.

థ్యాంక్యూ అంటూ విభిన్నమైన టైటిల్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో నాగచైతన్య హాకీ ప్లేయర్‌ గా కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. హాకీ ప్లేయర్‌ గా చేతిలో హాకీ స్టిక్ తో నాగచైతన్య నిల్చున్న ఫొటో లీక్‌ అయ్యింది. నాగచైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్‌ గా కనిపించబోతున్నాడు. మజిలీ సినిమాలో క్రికెటర్‌ గా కనిపించి మెప్పించిన ఈ యువ హీరో ఈసారి హాకీ ప్లేయర్‌ గా మెప్పిస్తాడేమో చూడాలి. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లుగా చెబుతున్నారు.

నాగచైతన్య ఇప్పటికే విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో మనం సినిమాను చేశాడు. ఆ సినిమా చైతూ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ మూవీగా నిలవడంతో పాటు తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే సినిమాగా కూడా గుర్తుండి పోతుంది అనడంలో సందేహం లేదు. మళ్లీ ఇన్నాళ్లకు చైతూతో 'థ్యాంక్యూ' చెప్పించబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ చివరి వరకు విడుదల అయ్యే అవకాశం ఉంది. మరో వైపు చైతూ లవ్‌ స్టోరీ కూడా విడుదలకు సిద్దంగా ఉంది.