Begin typing your search above and press return to search.
హారర్ వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ చేస్తున్నా: నాగచైతన్
By: Tupaki Desk | 22 Sep 2021 12:30 PM GMTయువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'మజిలీ' 'వెంకీమామ' వంటి రెండు సూపర్ హిట్స్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న చైతన్య.. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. సినీ అభిమానులు మరియు ఇండస్ట్రీ జనాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలు ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న చై.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నాగచైతన్య డిజిటల్ డెబ్యూ ఇవ్వడానికి రెడీ అయ్యారని.. ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్టుగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువసామ్రాట్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నానని చైతూ వెల్లడించారు. అయితే ఈ సిరీస్ లో తాను నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లు చైతన్య వెల్లడించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని తెలిపారు.
విక్రమ్ కుమార్ - నాగచైతన్య కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన 'మనం' సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో 'థాంక్యూ' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ క్రమంలో విక్రమ్ కుమార్ చెప్పిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉండటంతో నెగిటివ్ క్యారక్టర్ చేయడానికి అంగీకరించానని చైతన్య తెలిపారు. మంచి స్క్రిప్ట్ అయినప్పటికీ.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో సినిమా చేద్దామని నిర్మాతలను అడగలేనని.. వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ఆ అవకాశం అందిస్తోందని చై అన్నారు. బిగ్ స్క్రీన్ మీద తమకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల చాలా మంది యాక్టర్స్ అన్ని రకాల పాత్రల్లో నటించడం లేదని.. కానీ ఓటీటీల వల్ల అలాంటి అవకాశం దక్కుతోందని నాగచైతన్య చెప్పుకొచ్చారు.
చైతూ నటించే ఈ హారర్ జోనర్ సిరీస్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభించబోతున్నారని సమాచారం. ఇప్పటికే నాగచైతన్య సతీమణి సమంత 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు చై కూడా అదే బాటలో వెళ్తున్నారు. స్మాల్ స్క్రీన్ మీద అక్కినేని వారసుడు సత్తా చాటుతాడేమో చూడాలి. అక్కినేని నాగార్జున కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా అక్కినేని ఫ్యామిలీ మొత్తం రాబోయే రోజుల్లో ఓటీటీల హవా నడుస్తుందని భావించి.. వెబ్ కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్నట్లు అర్థం అవుతోంది.
ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం 'థాంక్యూ' సినిమాతో పాటుగా తన తండ్రితో కలిసి 'బంగార్రాజు' సినిమా చేస్తున్నారు. 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. అమీర్ ఖాన్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.