Begin typing your search above and press return to search.

నాన్న డేట్ లో కొడుకు దిగుతాడా?

By:  Tupaki Desk   |   21 July 2017 5:23 AM GMT
నాన్న డేట్ లో కొడుకు దిగుతాడా?
X
నాగ చైతన్య హీరోగా నాగార్జున ప్రొడ్యూసర్ గా వచ్చిన సినిమా రారాండోయి వేడుక చూద్దాం బాగాను డబ్బులు తెచ్చింది. అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కెట్ అయ్యిందనే చెప్పాలి. నాగ చైతన్యకు ఈ సినిమా మంచి బూస్ట్ అప్ ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఆ జోష్ తోనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ‘యుద్దం శరణం’ సినిమా షూటింగ్ లో బాగ బిజీ గా ఉన్నాడు. షూటింగ్ కూడా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనులుకు వెళ్లబోతుంది అని టాక్.

‘యుద్దం శరణం’ సినిమాలో చైతు ముందు సినిమాలు తో పోల్చుకుంటే కొంచెం కొత్తగా ఉంటుంది అని చెబుతున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మధ్యనే విడుదల చేశారు. పోస్టర్ తీరు చూస్తే నాగ చైతన్య మునుపటి కంటే స్టైల్ గా కనిపిస్తున్నాడు అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా.. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేస్తోంది. విషయం ఏంటంటే.. ఈ సినిమాను ఆగష్టు నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాకపోతే ఆగష్టు నెల అంతా ఇప్పటికే చాల సినిమాలుతో నిండి ఉన్నాయి. అందుకని ఇంకా ఒక డేట్ ఫిక్స్ చేయడం కష్టం అవుతుంది వీళ్ళకి. కాకపోతే ఇప్పుడు నాగార్జున తాజా సినిమా ‘రాజు గారి గది 2’ సినిమాను ముందుగా అనుకున్న ఆగస్టు 25న రిలీజ్ చేయట్లేదు కాబట్టి.. ఆ డేట్ కు ‘యుద్దం శరణం’ సినిమాను దించాలని చూస్తున్నారట. ఒకవేళ ఆగస్టు మిస్సయితే మాత్రం.. సెప్టెంబర్ అక్టోబర్ మాత్రం పెద్ద సినిమాల వలన పెద్దగా వర్కవుట్ కాలేదు.

‘యుద్దం శరణం’ సినిమా డైరెక్టర్ కృష్ణ మరైముత్తు కి ఇదే తొలి సినిమా. మొదటి సినిమా అయన కూడా ఈ సినిమాను చాల స్టైలిష్ గా డైరెక్ట్ చేసినట్లున్నాడు. పెళ్ళి చూపులు ఫేం వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం ఇవ్వగా.. సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.