Begin typing your search above and press return to search.

చై-హాష్ గేమ్ ఆన్.. ఇంత‌కీ ఏ గేమ్ .. బైక్ రేసింగేనా?

By:  Tupaki Desk   |   23 Dec 2020 10:01 AM IST
చై-హాష్ గేమ్ ఆన్.. ఇంత‌కీ ఏ గేమ్ .. బైక్ రేసింగేనా?
X
చై-హాష్ గేమ్ ఆన్.. ఇంత‌కీ ఏ గేమ్ .. బైక్ కార్ రేసింగేనా? మొత్తానికి మిస్ట‌రీ వీడే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. చైత‌న్య .. హాష్ ప‌సుపు రంగు స్పోర్ట్స్ డ్రెస్ లో క‌నిపిస్తున్నారంటే `గేమ్` పెద్ద రేంజులోనే ఉండ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇంత‌కీ ఆ గేమ్ ఏమిటో ఆరా తీస్తే.. తాజా స‌మాచారం ప్ర‌కారం...విక్రమ్ కుమార్ తో నాగ చైతన్య చిత్రం `థాంక్యూ` ఇప్ప‌టికే అధికారిక‌ ప్రారంభమైంది. దర్శకుడు విక్రమ్ కుమార్ వ‌రుస షెడ్యూల్స్ ని ఫిక్స్ చేశారు. భారీ తారాగణంతో షూట్ కిక్ స్టార్ట్ చేశారు. పి. సి. శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నారు.

తాజాగా ఈ విష‌యాన్ని విక్ర‌మ్.కె స‌హా శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు స్వ‌యంగా సోష‌ల్ మీడియాల్లో ప్ర‌క‌టించారు. నా తదుపరి ప్రయాణం ఈ రోజు నుండి భారీ తారాగణంతో ప్రారంభమైంది. . మిస్టర్ దిల్ రాజు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు చాలా త్వరగా తెలుస్తాయి... అని తెలిపారు.

మేకర్స్ థాంక్యూ చిత్రంలో నాయిక ఎవ‌రు? అన్న‌ది వెల్లడించాల్సి ఉంది. మనం తరువాత నాగ చైతన్య విక్రమ్ కుమార్ రెండోసారి క‌లిసి ప‌ని చేయ‌నున్నారు. బి.వి.ఎస్ రవి కథను అందిస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇదిలా వుండగా చైతన్య - సాయి పల్లవి జంట‌‌గా `లవ్ స్టోరీ` రిలీజ్ కి రావాల్సి ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. పెద్ద తెరపై నాగ చైతన్య- సాయి ప‌ల్ల‌వి అద్భుత‌మైన‌ కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ కానుందని ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు మోష‌న్ టీజ‌ర్ చెబుతున్నాయి.