Begin typing your search above and press return to search.

నాగార్జున‌కు ఫ్లాపిచ్చిన హీరోతో చై బ్యాన‌ర్ లాంచ్!

By:  Tupaki Desk   |   5 May 2020 9:45 AM IST
నాగార్జున‌కు ఫ్లాపిచ్చిన హీరోతో చై బ్యాన‌ర్ లాంచ్!
X
ఆ యంగ్ హీరోకి ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చింది. అయితే ఎంతో హోప్ తో సంక్రాంతి బ‌రిలో సెల‌వుల్ని క్యాష్ చేసుకోవాల‌ని తెలివిగా మంచి రిలీజ్ చేసినా ఆ మూవీ డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆ హీరోకి ఆ బ్యాన‌ర్ లో మ‌రో ఛాన్సే రాలేదు. అయితే త‌న‌ తండ్రికి ఫ్లాపిచ్చిన హీరోకి ఇప్పుడు కొడుకు ఛాన్సిస్తున్నాడు. అది కూడా తాను నిర్మాత‌గా మారుతూ.. ఆఫ‌ర్ ఇవ్వ‌డం షాకిస్తోంది. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ ఓ ఆ ముగ్గురు ఎవ‌రు? అంటే.. రాజ్ త‌రుణ్.. అన్న‌పూర్ణ స్టూడియోస్ అధినేత నాగార్జున‌.. అక్కినేని నాగ‌చైత‌న్య‌.

రాజ్ త‌రుణ్ హీరోగా అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో కింగ్ నాగార్జున ఓ రెండు సినిమాల్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. వాటిలో ఉయ్యాల జంపాల బంప‌ర్ హిట్. ఆ హిట్టిచ్చిన కిక్కులోనే రాజ్ త‌రుణ్ కి కింగ్ మ‌రో ఆఫ‌ర్ ఇచ్చారు. అది కూడా అన్న‌పూర్ణ బ్యాన‌ర్ లో రంగుల రాట్నం అంటూ క‌ల‌ర్ ఫుల్ సినిమా తీసి సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా ఆశించిన హిట్టు ద‌క్కించుకోలేక‌పోయింది. అటుపై అన్న‌పూర్ణ బ్యాన‌ర్ లో ఛాన్సులు రాలేదు.

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య నిర్మాత‌గా మారుతూ రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమాని నిర్మించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ‌కొచ్చింది. ఈ చిత్రానికి `సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు` ఫేం శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే నిర్మాత కాబోతున్న నాగ‌చైత‌న్య‌కు ద‌ర్శ‌కుడు క‌థ వినిపించి ఓకే చేయించాడ‌ట. తాజాగా హీరోని లాక్ చేశార‌‌ట‌. ఇక ఈ సినిమాకి బ‌డ్జెట్ ని స‌మ‌కూర్చేందుకు చైతూ సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని తెలుస్తోంది. నాగ‌చైత‌న్య‌- స‌మంత జోడీ నిర్మాతలుగా మారుతున్నార‌ని చాలా కాలంగా ప్ర‌చారం ఉంది. తాజా సినిమాతో చై నిర్మాత అవుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇక‌పై నాగార్జున వార‌సుడిగా చైతూ కూడా నిరూపించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. తొలిగా మీడియం బ‌డ్జెట్ చిత్రాల్ని నిర్మించ‌నున్నార‌ట‌. క్ర‌మంగా అనుభ‌వం ఘ‌డించాక పెద్ద సినిమాల నిర్మాణానికి చ‌ర‌ణ్ త‌ర‌హాలో శ్రీ‌కారం చుడ‌తార‌ట‌. అయితే వ‌రుస‌ ఫ్లాపుల్లో ఉన్న‌ హీరోతో బ్యాన‌ర్ ప్రారంభించ‌డం సాహ‌స‌మే. దీనిని ఏమేర‌కు స‌క్సెస్ చేస్తారు అన్న‌ది చూడాలి.