Begin typing your search above and press return to search.
చైతూకు ఇంకా ఆమె థ్యాంక్యూ చెప్పలేదా?
By: Tupaki Desk | 17 March 2021 10:00 PM ISTనాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న థ్యాంక్యూ సినిమా చిత్రీకరణ స్పీడ్ గా జరుగుతోంది. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా వారాలు అవుతున్నా ఇప్పటి వరకు హీరోయిన్ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. మొదటి నుండి హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకుంటున్న చిత్ర యూనిట్ సభ్యులకు ఆమె నుండి సరైన సమాధానం రాలేదు. పూజా హెగ్డే తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో థ్యాంక్యూ సినిమాకు డేట్లను కేటాయించలేక పోతుందనే టాక్ వినిపిస్తుంది. థ్యాంక్యూ సినిమా లో నటించేందుకు పూజా ఆసక్తిని కనబర్చుతున్నా కూడా డేట్ల విషయంలో కుదరడం లేదని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
థ్యాంక్యూ సినిమా తదుపరి షెడ్యూల్ లో హీరోయిన్ పై చిత్రీకరణ తప్పనిసరి. చైతూ మరియు హీరోయిన్ లపై షూట్ కోసం దర్శకుడు ప్లాన్ చేశాడు. మరి పూజా హెగ్డే అందుకు డేట్లు ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆమె నుండి స్పష్టత రాకపోవడంతో మరో వైపు థ్యాంక్యూ కోసం రీతూ వర్మను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి థ్యాంక్యూ సినిమా హీరోయిన్ విషయమై ఈ నెలాఖరు వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా లు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.