Begin typing your search above and press return to search.

కార్గిల్-క‌శ్మీర్ వార్ సీన్స్ లో అమీర్- నాగ‌చైత‌న్య‌?

By:  Tupaki Desk   |   7 May 2021 5:30 AM GMT
కార్గిల్-క‌శ్మీర్ వార్ సీన్స్ లో అమీర్- నాగ‌చైత‌న్య‌?
X
క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలంతో చాలావ‌ర‌కూ బాలీవుడ్ సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. టాలీవుడ్ కోలీవుడ్ సహా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఇదే పరిస్థితి. అయితే కొంద‌రు నిర్మాత‌లు త‌ప్ప‌ని ప‌రిస్థితిలో షూటింగుల్ని షురూ చేస్తున్నారు. క‌రోనా భ‌యాలు ఉన్నా.. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో తాము అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం షూట్ చేయాల్సి వ‌స్తోంది.

క‌రోనా వేళ‌.. ఇప్పుడున్న సీరియ‌స్ ప‌రిస్థితిలో మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ షూటింగ్ ను షురూ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. స్పెష‌ల్ ఫ్లైట్ లో అత‌డు ఇప్ప‌టికే కాశ్మీర్ వెళ్లారు. త‌న అప్ క‌మింగ్ లాలా చంద్ సింగ్ సినిమా షూట్ కోసం అమీర్ క‌రోనాని సైతం లెక్క చేయ‌డం లేదు. కాశ్మీర్ లో ప్ర‌స్తుతం పాక్షిక లాక్ డౌన్ ఉండ‌టంతో అక్క‌డ సినిమా షూటింగ్ కి పెద్ద‌గా ఆంక్ష‌లు లేవు. దీంతో కొన్ని యుద్ధ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌డానికి అమీర్ ఖాన్ ఈ ప్రాంతంలో రెక్కీ చేస్తున్నార‌ని స‌మాచారం.

ఇక ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌చైత‌న్య ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నార‌ని కాశ్మీర్ షెడ్యూల్ లో అత‌డు అమీర్ ఖాన్ తో జాయిన్ అవుతున్నాడ‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. మ‌రి దీనికి సంబంధించి అక్కినేని హీరో నుంచి అధికారికంగా ఏదైనా అప్ డేట్ అందుతుందేమో చూడాలి.