Begin typing your search above and press return to search.

బిబి4 : ఈ వీకెండ్‌ లో మరో అక్కినేని హీరో

By:  Tupaki Desk   |   12 Nov 2020 5:45 AM GMT
బిబి4 : ఈ వీకెండ్‌ లో మరో అక్కినేని హీరో
X
తెలుగు బిగ్‌ బాస్‌ రేటింగ్‌ మరీ దారుణంగా వస్తున్న నేపథ్యంలో క్రియేటివ్‌ టీమ్‌ కొత్త కొత్త ఐడియాలను వేస్తుంది. దసరా రోజు సమంతను హోస్ట్‌ గా తీసుకు రావడం వల్ల మంచి రేటింగ్‌ ను దక్కించుకున్నారు. గత ఆదివారం సుమను తీసుకు రావడంతో రేటింగ్‌ భారీగా వచ్చినట్లుగా తెలుస్తోంది. సుమ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటూ ప్రచారం చేసి ఆ రోజు ఎపిసోడ్‌ కు భారీగా వ్యూవర్‌ షిప్‌ ను దక్కించుకున్నారు. ఇక ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌ ల రేటింగ్‌ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ నుండి సమంత మరియు అఖిల్‌ లు ఈ సీజన్‌ లో కనిపించారు. కనుక మిగిలి ఉన్న నాగచైతన్యను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌ లో నాగచైతన్యను గెస్ట్‌ గా తీసుకు రాబోతున్నారు. నాగార్జున హోస్ట్‌ గా వస్తాడా రాడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని తాజాగా నాగార్జునకు కరోనా నెగటివ్‌ అంటూ రావడంతో ఆయనే హోస్ట్‌ అనే విషయం క్లారిటీ వచ్చింది. ఇక శని మరియు ఆదివారాల్లో ఇద్దరు గెస్ట్‌ లను తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఒక గెస్ట్‌ గా నాగచైతన్య రాబోతుండగా మరో గెస్ట్‌ ఎవరు అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. అక్కినేని ఫ్యాన్స్‌ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా బిగ్‌ బాస్‌ టీం ప్లాన్‌ చేస్తోంది.