Begin typing your search above and press return to search.

నాగ‌చైత‌న్య నుంచి బిగ్‌ స‌ర్ ప్రైజ్ రెడీ

By:  Tupaki Desk   |   23 May 2022 12:34 PM GMT
నాగ‌చైత‌న్య నుంచి బిగ్‌ స‌ర్ ప్రైజ్ రెడీ
X
క్రేజీ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య త‌న ఫ్యాన్స్ కి స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌డానికి రెడీ అయిపోయాడు. మ‌రో రెండు రోజుల్లో త‌న అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్నాడు. వివ‌రాల్లోకి వెళితే.. విభిన్న‌మైన సినిమాల‌ని ఎంచుకుంటూ హీరోగా త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు యంగ్ హీరో నాగచైత‌న్య‌. ఇదే ఏడాది `లాల్ సింగ్ చ‌ద్దా` తో బాలీవుడ్ బాట ప‌డుతున్న చై తెలుగులో చేస్తున్న మూవీ థాంక్యూ`. `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాశీఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్, అవికా గోర్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్నఈ మూవీ జూలై 8న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల కాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ టీజ‌ర్ ని మే 25న విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టిస్తూ సోమ‌వారం ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. టీజ‌ర్ ని మే 25 సాయంత్రం 5:04 నిమిసాల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

పోస్ట‌ర్ తో పాటు టీజ‌ర్ అనౌన్స్ మెంట్ వీడియోని వినూత్నంగా విడుద‌ల చేశారు. నాగ‌చైత‌న్య త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతుండ‌గా ఓ వ్య‌క్తి వీడియో తీయ‌డం.. ఏం జ‌రుగుతోంది విక్ర‌మ్ అంటూ చై ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ ని అడ‌గ‌డం.. అది టీమ్ రిలీజ్ అనౌన్స్ మెంట్ కోసం అని చెప్ప‌డం.. అందుకు చై ఎక్సైట్ అవుతూ నిజ‌మా అని ఆనందాన్ని వ్య‌క్తం చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

వినూత్న‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకుంటూ ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేత‌ను చాటుకున్న విక్ర‌మ్ కె కుమార్ `థాంక్యూ`ని కూడా ఎవ‌రూ ఎక్స్ పెక్ట్ చేయ‌ని క‌థ‌తో తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో హీరో నాగ‌చైత‌న్య `సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు హార్డ్ కోర్ ఫ్యాన్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే బ‌య‌టికి వ‌చ్చిన ఓ వీడియో ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. భారీ మ‌హేష్ క‌టౌట్ కు నాగ‌చైత‌న్య పాల‌భిషేకం చేస్తున్న ఓ స‌న్నివేశానికి సంబంధించిన వీడియో ఆ మ‌ధ్య నెట్టింట సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

దీంతో చై ఇందులో మ‌హేష్ బాబు కు హార్డ్ కోర్ ఫ్యాన్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ని స్ఫ‌స్ట‌మైంది. చై కెరీర్ లోనే మ‌ర్చిపోలేని విధంగా తెర‌క్కుతున్న ఈచిత్రానికి లెజెండ‌రీ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం, బీవీఎస్ ర‌వి క‌థ అందిస్తున్నారు. ఈ మూవీపై నాగ‌చైత‌న్య భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌.