Begin typing your search above and press return to search.
ముగ్గురు ముద్దుగుమ్మలకు థ్యాంక్యూ చెప్పబోతున్న చైతూ
By: Tupaki Desk | 4 Nov 2020 10:15 AM ISTఅక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్న 'థ్యాంక్యూ' రెగ్యులర్ షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యింది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే మనం వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక విక్రమ్ కుమార్ గత సినిమాలు కూడా మంచి కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్న నేపథ్యంలో మొదటి నుండి కూడా థ్యాంక్యూ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా ఆలస్యం అయిన థ్యాంక్యూ సినిమా పనులు ఎట్టకేలకు స్పీడ్ అయ్యాయి.
ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ఎంపిక అయ్యింది. విక్రమ్ గత సినిమా నాని గ్యాంగ్ లీడర్ బ్యూటీ అయిన ప్రియాంకను థ్యాంక్యూ సినిమాకు కూడా ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఈ అమ్మడు కాకుండా చైతూకు జోడీగా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించబోతున్నారట. వారు ఎవరు అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కథానుసారంగా ముగ్గురు ముద్దుగుమ్మలకు సమానమైన ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు.
మరో ఇద్దరు హీరోయిన్స్ విషయంలో విక్రమ్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ తో చర్చలు జరుపుతున్నప్పటికి బడ్జెట్ పరిమితులు ఉన్న కారణంగా ఒకరు స్టార్ హీరోయిన్ మరొకరు మీడియం రేంజ్ హీరోయిన్ ను ఎంపిక చేసేలా విక్రమ్ ఆలోచన చేస్తున్నాడట. సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. అప్పటి వరకు ఆ ఇద్దరు ముద్దుగుమ్మల విషయమై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.