Begin typing your search above and press return to search.

సాయిపల్లవిని చైతూ అందుకోగలడా..?

By:  Tupaki Desk   |   21 March 2020 2:30 AM GMT
సాయిపల్లవిని చైతూ అందుకోగలడా..?
X
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సున్నితమైన ప్రేమ కథా చిత్రాలని తనదైన స్టైల్ లో తెరకెక్కించే శేఖర్ కమ్ముల, 'మజిలీ', 'వెంకీమామ' వంటి వరుస విజయాలతో దూకుడు మీదున్న నాగచైతన్యతో కలిసి మరో లవ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నాడు. 'ఫిదా' లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

'ఫిదా' సినిమాలో తన నటనతో అందరి ప్రసంశలు పొందిన సాయిపల్లవి నాగచైతన్యతో కలిసి మొదటిసాటి నటిస్తుంది. సాయిపల్లవి అలాంటి నటననే అందిస్తుందని అందరికీ తెలుసు. కానీ నటనలో నాగచైతన్య ఈమెను అందుకోగలడా అని ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది డౌట్ వ్యక్తం చేసారు. 'లవ్ స్టోరీ' నాగచైతన్య మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం కోసం నాగచైతన్య తెలంగాణా మాండలికాన్ని నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని ఇండస్ట్రీలో ఇప్పటికే టాక్ నడుస్తున్నది. దీనిని నిజం చేస్తూ ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేసిన వీడియోలో నాగచైతన్య నటనను చూస్తే ఎవరైనా ఒప్పుకోక మానరు. సాయి పల్లవి తనని ముద్దు పెట్టుకున్నప్పుడు చైతు చూపించిన హావభావాలకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కాబట్టి ఈ చిత్రంలో సాయిపల్లవిని మించి నాగచైతన్య యాక్టింగ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ విమర్శకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.