Begin typing your search above and press return to search.

నిన్ను రోడ్డుమీద చూసినాక ల‌గ్గా ఎత్తు!

By:  Tupaki Desk   |   16 Sep 2018 4:44 AM GMT
నిన్ను రోడ్డుమీద చూసినాక ల‌గ్గా ఎత్తు!
X
నాగ‌చైత‌న్య న‌టించిన `శైల‌జారెడ్డి అల్లుడు` సాఫీగా రిలీజై విజ‌య‌వంతంగా ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి తొలిరోజు మిక్స్‌ డ్ రివ్యూలు వచ్చినా - క‌లెక్ష‌న్ల ప‌రంగా డోఖా లేకుండా ముందుకు సాగుతోంద‌ని ట్రేడ్ చెబుతోంది. ఆ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌ లో ఘ‌న‌మైన స‌క్సెస్‌ మీట్‌ ని నిర్వ‌హించింది చిత్ర‌యూనిట్‌. పీపుల్స్ బ్లాక్‌ బ‌స్ట‌ర్ అంటూ బోలెడంత హంగామా చేశారు. అదంతా స‌రే.. ఈ స‌క్సెస్ నేప‌థ్యంలో చైత‌న్య న‌టిస్తున్న `స‌వ్య‌సాచి` చిత్రాన్ని అంతే హుషారుగా రిలీజ్ చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాని న‌వంబ‌ర్ 2న రిలీజ్ చేయ‌నున్నార‌న్న‌ది అన్న‌పూర్ణ ఇన్‌ సైడ్ టాక్‌.

ఈలోగానే `స‌వ్య‌సాచి` బ్యాలెన్స్ చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేస్తున్నారు. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్‌ లో వేసిన భారీ సెట్‌లో `నిన్ను రోడ్డుమీద చూసినాక ల‌గ్గా ఎత్తు!` రీమిక్స్ సాంగ్‌ ను తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌వానికి ఈ పాట‌లో మిల్కీవైట్ బ్యూటీ త‌మ‌న్నా న‌ర్తిస్తుంద‌ని తొలుత ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు చైతూ- నిధి అగ‌ర్వాల్‌ పైనే ఈ పాట‌ను తెరకెక్కిస్తున్నార‌ని తెలిసింది. యంగ్ & బోల్డ్ బ్యూటీ నిధి డ్యాన్సులు ఈ పాట‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయిట‌.

నాగ‌చైత‌న్య‌కు `ప్రేమ‌మ్` లాంటి క్లాసిక్ హిట్‌ ని అందించిన చందు మొండేటి `స‌వ్య‌సాచి` లాంటి థ్రిల్ల‌ర్ బేస్డ్ సినిమాతో మ‌రో బ్లాక్‌ బ‌స్ట‌ర్ అందించేందుకు క‌సిగా ప‌ని చేస్తున్నారు. ఈ సినిమాకి అన్ని ర‌కాల మ‌సాలాలు ద‌ట్టించి రంజుగా త‌యారు చేస్తున్నాడు. నాగార్జున‌- ర‌మ్య‌కృష్ణ క్లాసిక్ సాంగ్‌ ని రీమేక్ చేయ‌డం వెన‌క రీజ‌న్ కూడా ఇదే. ఈ పాట సినిమాకే హైలైట్ గా ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు మ్యాడీ అలియాస్ మాధ‌వ‌న్ న‌ట‌న ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం కానుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ రాజీ అన్న‌దే లేకుండా ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఎలానూ న‌వంబ‌ర్ 7 న దీపావ‌ళి పండ‌గ‌ ఉంది కాబ‌ట్టి ఆ సెల‌వు కూడా క‌లిసొస్తుంది. అందుకే న‌వంబ‌ర్ తొలివారంలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక‌పై ప్ర‌మోష‌న్స్ ప‌రంగానూ టీమ్ వేగం పెంచ‌నుంద‌ని తెలుస్తోంది.