Begin typing your search above and press return to search.
చైతూ మూడు నెలలు ఇలా గడిచిపోయాయట
By: Tupaki Desk | 25 Jun 2020 4:00 AM GMTగడచిన మూడు నెలలుగా టాలీవుడ్ టాప్ స్టార్ సెలబ్రెటీల నుండి సినీ కార్మికుల వరకు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. గత వారం రెండు వారాలుగా షూటింగ్స్ కు మళ్లీ రెడీ అవుతున్నారు. ఖాళీ సమయంను స్టార్స్ నుండి సాదారణ జనాల వరకు ఎక్కువగా ఓటీటీతో గడిపేశారు. పాత వెబ్ సిరీస్ లు.. పాత సినిమాలను ఓటీటీ పై వీక్షించారు. ఈ సమయంలో దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై లక్షల వ్యూస్ నమోదు అయ్యాయి. స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లను రెగ్యులర్ గా చూస్తూ టైం పాస్ చేసినట్లుగా చెబుతున్నారు. తాజాగా నాగచైతన్య కూడా తన ఆ ఫ్రీ టైంను ఎలా గడిపాడనే విషయంపై మాట్లాడుతూ ఎక్కువ సమయం ఓటీటీపై స్ట్రీమింగ్ చేస్తూ గడిపేశానంటూ పేర్కొన్నాడు.
నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న చెర్నోబిల్ డైరీస్ ను నాగచైతన్య చూశాడట. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అందులోని నటీనటుల నటన కూడా అద్బుతం అంటూ టాక్ వచ్చింది. ఈమద్య కాలంలో అత్యధికులు చూసిన వెబ్ సిరీస్ గా ఇది నిలిచింది. అలాంటి వెబ్ సిరీస్ ను నాగచైతన్య ఈ ఫ్రీ టైంలో స్ట్రీమ్ చేశాడట. దీంతో పాటు మనోజ్ బాజ్ పాయి నటించిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ను కూడా నాగచైతన్య చూశాడట. ఈ రెండు వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని షోలను కూడా చూస్తూ తన ఫ్రీ టైం ను ఎంజాయ్ చేశానంటూ తాజాగా ఒక సందర్బంలో పేర్కొన్నాడు.
ఈ బ్రేక్ వచ్చి ఉండకుంటే నాగచైతన్య హీరోగా రూపొందిన శేఖర్ కమ్ముల చిత్రం ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టేవాడు. కాని మహమ్మారి వైరస్ కారణంగా సినిమాల షూటింగ్స్ లేకపోవడంతో ఓటీటీలో వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ చేసుకుంటూ చైతూ టైం గడపాల్సి వచ్చింది.