Begin typing your search above and press return to search.

చెయ్ వర్సెస్ చెయ్.. సీన్లో నాగ్??

By:  Tupaki Desk   |   4 July 2018 6:21 AM GMT
చెయ్ వర్సెస్ చెయ్.. సీన్లో నాగ్??
X
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్నాక కొద్దికాలం సినిమాలకు గ్యాపిచ్చాడు అక్కినేని నాగచైతన్య. తరవాత తక్కువ టైంలో షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టేశాడు. చందు మొండేటి డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టెయినర్ సవ్యసాచి మొదలెట్టాడు.

మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్ సవ్యసాచిని నిర్మిస్తోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ భారీగానే వినియోగిస్తున్నారు. అందుకే ప్లాన్ చేసిన దానికన్నా షూటింగ్ డిలే అయింది. మరి క్వాలిటీ అవుట్ పుట్ కావాలంటే ఆ మాత్రం టైమ్ పడుతుంది అంతే. ఇక సవ్యసాచి తరవాత మారుతి డైరెక్షన్ లో శైలజారెడ్డి అల్లుడు సినిమా చేయడానికి చై ఓకే చెప్పాడు. ఇది పూర్తి ఎంటర్ టెయిన్ మెంట్ మూవీ. గ్రాఫిక్స్ హంగులేవీ లేవు. దానితో మూడు నెలల్లోనే కంప్లీట్ చేసేశారు. అయితే ఈ సినిమా పూర్తయ్యేలోపు సవ్యసాచిని ఆగస్టు చివరకు తేవాలని ఆ సినిమా నిర్మాతలు డిసైడ్ అయ్యారు. కాని అంతలోనే శైలజారెడ్డి మేకర్లు కూడా అదే టైములో రిలీజ్ చేయాలని అనుకుంటన్నారట.

ప్రస్తుతం సవ్యసాచిని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ - శైలజారెడ్డి అల్లుడు నిర్మిస్తున్న సితార ఎంటర్ టెయిన్ మెంట్స్ సంస్థలు రెండూ తమ సినిమాలు ఆగస్టు చివరకు థియేటర్లకు తీసుకురావడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి. ఒక హీరోతో ఇంకో హీరో పోటీపడి రిలీజ్ చేయడమే అనవసరంగా నష్టాలపాలు అవుతున్నారు. కానీ నాగచైతన్య తనతో తనే పోటీపడితే ఎలా? ఇదే విషయంపై ఇప్పుడు నాగార్జున ఒక నిర్ణయం తీసుకోనున్నారట. అటు సవ్యసాచి సినిమా కూడా చాలా బాగా రావడంతో.. ఆ సినిమాను ముందుగా రిలీజ్ చేయించి.. తరువాత శైలజా రెడ్డి అల్లుడుని దించమని సూచించారట. చూద్దాం ఏమవుతుందో.