Begin typing your search above and press return to search.

చైతు డేట్స్ క్లాష్ అవుతున్నాయే

By:  Tupaki Desk   |   2 Jun 2018 11:59 AM IST
చైతు డేట్స్ క్లాష్ అవుతున్నాయే
X
సాధారణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది హీరోలు ఒక సినిమా షూటింగ్ అయిపోతే గాని మారో సినిమా ఒకే చేయడం లేదు. స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు ఒక సినిమా తరువాత మరో సినిమా సెట్స్ పైకి తీసుకువెళుతున్నారు. ఎందుకంటే డేట్స్ విషయంలో ఎప్పుడో ఒకప్పుడు క్లాష్ అవ్వకుండా ఉండదు. అందుకే సినిమా షూటింగ్ ల విషయంలో మన హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. నాగ చైతన్య కి మొదటి సారి రెండు సినిమాలా షూటింగ్ ల వల్ల డేట్స్ క్లాష్ అయ్యాయి. అసలైతే ముందే సవ్యసాచి సినిమా విడుదల కావాలని ఫాస్ట్ గా సినిమా షూటింగ్ ని జరిపారు. కానీ మధ్యలో కొన్ని సీన్స్ మీద అనుమానంతో రీ షూట్ చేశారు. దీంతో అది కాస్త శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ కి ఎఫెక్ట్ పడింది. సాధారణంగా మారుతీ ఎక్కువ సమయం తీసుకోడు. ఆగస్ట్ లోనే షూటింగ్ పూర్తి చెయ్యాలని అనుకున్నాడు.

కానీ సవ్యాసాచి రీ షూట్ వల్ల చైతు డేట్స్ క్లాష్ అవుతున్నాయి. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. తొందరగా ఫినిష్ చేయాలనే ఆలోచన వల్ల మారుతి ప్లాన్ మొత్తం రివర్స్ అయినట్లు టాక్. శైలజా రెడ్డి మొదట అగస్ట్ 30న రిలీజ్ చెయ్యాలని చెబుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు చైతు డేట్స్ కుదరకపోవడంతో రెండు సినిమాల విడుదల తేదీల్లో తేడాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.