Begin typing your search above and press return to search.

అమ్మతో సమంత అనుబంధంపై చైతూ...

By:  Tupaki Desk   |   5 Jun 2017 10:40 AM GMT
అమ్మతో సమంత అనుబంధంపై చైతూ...
X
అక్కినేని నాగచైతన్య.. సమంత రూత్ ప్రభు.. వీళ్లిద్దరూ భిన్న ధ్రువాల్లాగా కనిపిస్తారు. చైతూ బాగా రిజర్వ్డ్ అయితే.. సమంత హైపర్ యాక్టివ్. మరి వీళ్లిద్దరికీ ఎలా లంకె కుదిరిందో అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తే.. ఆ వైరుధ్యమే ఇద్దరినీ కలిపిందని కొందరంటారు. చైతూతో రిలేషన్ షిప్ తర్వాత సమంత.. అక్కినేని కుటుంబంతో కలిసిపోయిన తీరు.. ముఖ్యంగా నాగార్జునతో ఆమె రిలేషన్.. ఇద్దరి మధ్య సంభాషణలు జనాల్లో భలే ఆసక్తి రేకెత్తించాయి. ఐతే తన మావయ్యతోనే కాదు.. అత్తమ్మతోనూ సమంత మంచి సంబంధాలే నెరుపుతోందట. తన తల్లి లక్ష్మికి సమంత చాలా క్లోజ్ అని.. వాళ్లిద్దరూ రోజూ చాలాసేపు మాట్లాడుకుంటారని చైతూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.

తన తల్లికి సమంత రోజూ ఫోన్ చేస్తుందని.. కనీసం వాళ్లిద్దరూ గంటసేపు మాట్లాడుకుంటారని చైతూ వెల్లడించాడు. తన తల్లితో తన కంటే సమంత క్లోజ్ అయిపోయిందని చైతూ అన్నాడు. అలాగే తన తల్లి ఎప్పుడు ఇండియా వచ్చినా.. ఆమె.. సమంత చెన్నైలో కలుస్తారని.. హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారని అతనన్నాడు. తన తండ్రి నాగార్జునతోనూ సమంతకు మంచి రిలేషన్ ఉందని.. ఇద్దరూ ఎప్పుడు కలిసినా తన కెరీర్ గురించి.. తన సినిమాల గురించే మాట్లాడుకుంటారని చైతూ తెలిపాడు. సమంత తన లైఫ్ లోకి వచ్చాక చాలా సంతోషం.. ప్రశాంతత వచ్చాయన్న చైతూ.. ఆమె తనకు పరిచయం కావడానికి కారణమైన దర్శకుడు గౌతమ్ మీనన్ కు ధన్యవాదాలు చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/