Begin typing your search above and press return to search.

‘చైతు’ మాసం ‘శ్రుతి’ హాసం..

By:  Tupaki Desk   |   9 April 2016 7:54 AM GMT
‘చైతు’ మాసం ‘శ్రుతి’ హాసం..
X
మలయాళంలో ఇరగదీసిని సినిమా ప్రేమమ్ కు రీమేక్ గా తెలుగులో నాగచైతన్య నటిస్తున్న సినిమా పోస్టరును ఉగాది సందర్భంగా విడుదల చేశారు. ఆ పోస్టర్ ఇప్పుడు సినీ అభిమానులను విశేషంగా ఆకట్టకుంటోంది. నాగచైతన్య గడ్డంతో రఫ్ లుక్ లోనూ నవ్వుతూ లవర్ బాయ్ లా కనిపిస్తుండగా శ్రుతిహాసన్ సంప్రదాయ చీరకట్టులో కవ్విస్తూ కనిపిస్తోంది. పోస్టర్ చూసినవారంతా చైతు - శ్రుతి కాంబినేషన్ లో ప్రేమమ్ తెలుగులోనూ సూపర్ హిట్ కావడం ఖాయమని అప్పుడే అంటున్నారు. కొత్త సంవత్సరంలో ప్రేమమ్ రూపంలో చైతుకు భారీ హిట్ దొరుకుతుందేమో చూడాలి.

కాగా ఈ సినిమా మళయాల వెర్షన్ లో నవీన్ పాలీ హీరోగా నటించారు. ముగ్గురు హీరోయిన్లతో ఆయన సినిమాను రక్తి కట్టించారు. అనుపమ పరమేశ్వరన్ - సాయి పల్లవి - మడోనా సెబాస్టియన్లు మళయాలంలో హీరోయిన్లుగా చేశారు. తెలుగులో నవీన్ పాలీ పాత్రతో చైతు నటిస్తుండగా సాయిపల్లవి పాత్రలో శ్రుతి హాసన్ నటిస్తోంది. కార్తికేయ సినిమా ఫేం చందూ మొండేటి దీనికి దర్శకుడు. మరోవైపు నాగార్జున ఊపిరి సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన గోపీ సుందర్ తెలుగు ప్రేమమ్ లో స్వరాలు పలికిస్తున్నారు.