Begin typing your search above and press return to search.

నందమూరి వర్సెస్ అక్కినేని.. ఫైట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   9 Jun 2016 6:53 AM GMT
నందమూరి వర్సెస్ అక్కినేని.. ఫైట్ ఫిక్స్
X
ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి వర్సెస్ అక్కినేని ఫైట్ ఏర్పడింది. పొంగల్ పండక్కి బాలయ్య డిక్టేటర్ - ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రాలతో పాటు.. నాగార్జున మూవీ సోగ్గాడే చిన్ని నాయన రిలీజ్ అయింది. అన్నింటిలోకి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సోగ్గాడు.. టాప్ ప్లేస్ ని పట్టుకెళ్లిపోయాడు. ఇదే ఏడాది మరోసారి నందమూరి వర్సెస్ అక్కినేని ఫైట్ ఫిక్స్ అయిపోయింది.

ఆగస్ట్ 12న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ రిలీజ్ ను గతంలోనే ప్రకటించారు. నాన్నకుప్రేమతో జోష్ లో ఉన్న జూనియర్ - రెండు సక్సెస్ లతో ఊపు మీదున్న కొరటాల కాంబినేషన్ లో వస్తుండడంతో.. అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి. ఇప్పుడీ జనతా గ్యారేజ్ తో ఫైటింగ్ కి అక్కినేని హీరో నాగచైతన్య రెడీ అయిపోయాడు. అదే రోజున ప్రేమమ్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు తేల్చేశారు నిర్మాతలు.

ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత నుంచి ప్రేమమ్ ఆగస్టు 12 విడదలకు సంబంధించిన అనౌన్స్ మెంట్ అందింది. రీసెంట్ గా అ..ఆ..సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిర్మాత రాధకృష్ణ సోదరుడి కుమారుడు.. సితార ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ పై ప్రేమమ్ ని నిర్మిస్తున్నాడు. చైతుకు జోడీగా శృతి హాసన్ - అనుపమా పరమేశ్వరన్ - మడొన్నా సెబాస్టియన్ లు ఇందులో హీరోయిన్ లుగా నటించారు. అయితే.. సంక్రాంతి రేస్ లో అక్కినేని వారు విన్నర్ గా నిలిస్తే.. ఇప్పుడు ఆగస్ట్ పోటీలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది.