Begin typing your search above and press return to search.

చైతూ.. రెండు పడవల ప్రయాణం

By:  Tupaki Desk   |   8 Jan 2016 1:30 PM GMT
చైతూ.. రెండు పడవల ప్రయాణం
X
‘దోచేయ్’ సినిమా నిరాశ పరచడంతో కొంత డీలా పడిపోయి కొంచెం గ్యాప్ తీసుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ఐతే స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ మొదలుపెట్టక మళ్లీ అతడిలో ఉత్సాహం వచ్చింది. అలాంటి క్రేజీ ప్రాజెక్టు తర్వాత ‘మజ్ను’ రూపంలో మరో మెమొరబుల్ మూవీ చేసే ఛాన్స్ రావడంతో చైతూ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడిప్పుడు.

రెండు నెలల కిందట మొదలైన ‘మజ్ను’ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. ఇప్పటికే సగానికి పైగా సినిమా పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ‘ప్రేమమ్’ సినిమాలో హీరోకు మూడు లవ్ స్టోరీలుంటాయి. అందులో ముందు టీనేజ్ లవ్ స్టోరీ వస్తుంది. ప్రస్తుతం కోన సీమ అందాల మధ్య ఈ ఎపిసోడే చిత్రీకరిస్తున్నారు. ‘కార్తికేయ’ మూవీతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ‘మజ్ను’ షూటింగ్ లో పాల్గొంటూనే మధ్య మధ్యలో గౌతమ్ మీనన్ సినిమాకు కూడా పని చేస్తున్నాడు చైతూ. ఆ సినిమా షూటింగ్ ఈ పాటికే పూర్తవ్వాల్సింది కానీ.. శింబు వ్యక్తిగత వివాదాల కారణంగా కొంత భాగం వాయిదా పడింది. ఇద్దరు హీరోలతో ఒకే లొకేషన్ లో వేర్వేరుగా తీయాల్సిన సన్నివేశాలు ఆగిపోయాయి. చెన్నై వరదలు - శింబు బీప్ సాంగ్ గొడవ కారణంగా ఈ సన్నివేశాల చిత్రీకరణ వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ కంటిన్యూ అవుతోంది. మొత్తానికి ఒకేసారి రెండు సినిమాల షూటింగులో పాల్గొంటూ బాగానే కష్టపడుతున్నాడు చైతూ.