Begin typing your search above and press return to search.

కరిగించడం మొదలుపెట్టిన చైతూ

By:  Tupaki Desk   |   19 March 2016 5:29 AM GMT
కరిగించడం మొదలుపెట్టిన చైతూ
X
అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు మలయాళ బ్లాక్ బస్టర్ 'ప్రేమమ్' తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఒకే పాత్ర కోసం మూడు రకాల గెటప్స్ లో కనిపించాల్సి ఉంటుంది. ఒకటి టీనేజ్ కుర్రాడు - రెండోది యంగ్ జనరేషన్, మూడోది మెచ్యూర్ట్ పర్సన్ కేరక్టర్. ఇప్పటికే రెండు, మూడు కేరక్టర్లకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయిపోగా.. ఇంకా టీనేజ్ కుర్రాడి గెటప్ లో చైతూ కనిపించలేదు.

ఇలా టీనేజ్ అబ్బాయిలో కనిపిచేందుకు నాగచైతన్య తన బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 'త్వరలో వర్కవుట్స్ స్టార్ట్ చేయబోతున్నా. లుక్ పూర్తిగా మారేలా జాగ్రత్తలు తీసుకుంటాను. నా బరువు తగ్గించుకుంటేనే టీనేజ్ లుక్ సాధ్యమవుతుందని నాకు తెలుసు' అంటున్నాడు చైతు. తెలుగు ప్రేమమ్ సూపర్బ్ గా వస్తోందని.. తాము అనుకున్న స్థాయి కంటే ఔట్ పుట్ చాలా బాగుందని.. చందు మొండేటి పర్ఫెక్ట్ గా పిక్చరైజే చేస్తున్నాడని చెబుతున్నాడు నాగ చైతన్య.

ప్రేమమ్ తో పాటు గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో సాహసం శ్వాసగా చేస్తున్నాడు చైతూ. ఈ మూవీ కోసం ఇంకొన్ని పాటలను పిక్చరైజ్ చేయాల్సి ఉండగా.. వచ్చే నెలాఖరు నాటికి ఇవి కూడా పూర్తయిపోతాయని చైతూ చెప్పాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తమిళ్ వెర్షన్ కి శింబు హీరో. తెలుగు వెర్షన్ కి నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు.