Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కెరీర్ పై కుండబద్దలు కొట్టిన నాగచైతన్య

By:  Tupaki Desk   |   25 July 2022 11:30 PM GMT
బాలీవుడ్ కెరీర్ పై కుండబద్దలు కొట్టిన నాగచైతన్య
X
అక్కినేని యువ హీరో నాగచైతన్య ఇటీవల థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్లో రూపొందిన ఆ సినిమాను విక్రమ్ కుమార్ తెరపైకి తీసుకు వచ్చాడు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. మొదటి రోజే సినిమాకు చాలా తక్కువ కలెక్షన్స్ రావడంతో సినిమా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నట్లు అందరికి ఒక క్లారిటీ వచ్చింది.

ఇక సినిమా రిజల్ట్ గురించి మర్చిపోయిన నాగచైతన్య పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయడం లేదు. ఇక రాబోయే లాల్ సింగ్ చద్దా సినిమా పైనే ప్రస్తుతం ఈ హీరో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు.

ఆ సినిమాలో నటించిన తర్వాత నాగచైతన్యా ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు అనేక రకాల కథనాలు అయితే వచ్చాయి. ఈ క్రమంలో బాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడ కెరీర్ ప ఫోకస్ పెడతాడా అనే సందేహాలకు కూడా నాగచైతన్య సమాధానం ఇచ్చారు.

లాల్ సింగ్ చద్దా సినిమా అనేది నేను కేవలం అమీర్ ఖాన్ కోసం మాత్రమే చేశాను. ఆయనతో నటించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కోరికతోనే నేను ఆయనతో నటించడం జరిగింది. దానికి తోడు పాత్ర కూడా అద్భుతంగా ఉంది కాబట్టి పెద్దగా సందేహించాల్సిన అవసరం లేదు. అసలు ఇలాంటి సినిమాలో నాకు అవకాశం దక్కుతుంది అని ఎన్నడు అనుకోలేదు.

ఇంతమంచి అవకాశం నాకు ఇచ్చిన అమీర్ ఖాన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే బాలీవుడ్ నేను పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. ప్రస్తుతం నా హార్ట్ మొత్తం ఇక్కడే ఉంది.. అని నాగచైతన్య తన మనసులోని మాటను చాలా ఓపెన్గా తెలియజేశాడు.

ఇక నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక కాప్ యాక్షన్ సినిమాలో నటించబోతున్నాడు. అలాగే విక్రమ్ దర్శకత్వంలో దూత అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. వీటితోపాటు మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.