Begin typing your search above and press return to search.

నాగ చైతన్య-విక్ర‌మ్ కె `థాంక్యూ`కి క‌రోనా సెగ‌

By:  Tupaki Desk   |   19 April 2021 5:31 AM GMT
నాగ చైతన్య-విక్ర‌మ్ కె `థాంక్యూ`కి క‌రోనా సెగ‌
X
కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ పై ప్ర‌భావం చూపెడుతోంది. వ‌రుస‌గా సినిమాల రిలీజ్ లు వాయిదా ప‌డుతున్నాయి. కొద్దిరోజుల పాటు షూటింగుల్ని బంద్ చేయాల్సిన ప‌రిస్థితి. ఇంత‌కుముందే నాగ చైతన్య లవ్ స్టోరీ విడుదలను వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 16న రావాల్సిన ఈ చిత్రాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాత‌లు ప్రకటించారు. ఊహించని నిర్ణ‌యానికి సెకండ్ వేవ్ ప్ర‌ధాన‌ కారణం.

తాజా స‌మాచారం మేర‌కు.. చైతూ మరో చిత్రం కూడా వైరస్ వేవ్ కారణంగా ఇబ్బందుల్లో పడింది. స్పష్టంగా అందిన స‌మాచారం మేర‌కు.. 15 రోజుల షెడ్యూల్ కోసం ఇటలీకి వెళ్లాల్సిన `థాంక్స్` టీం ఆ ప్రణాళికలను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. విదేశీ ప్ర‌యాణానికి బ‌దులుగా వేరొక ప్ర‌ణాళిక‌కు టీమ్ సిద్ధ‌మ‌వుతోంది.

ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా ఇందులో క‌థానాయిక‌. మాళ‌విక నాయర్.. అవికా గోర్ ఇత‌ర నాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నాగ‌చైత‌న్య ఓ వెబ్ సిరీస్ లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని స‌మాచారం.