Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత చైతూ ఈగో

By:  Tupaki Desk   |   3 Oct 2017 11:20 PM IST
పెళ్లి తర్వాత చైతూ ఈగో
X
యుద్ధం శరణం సినిమాతో డిజాస్టర్ ని అందుకున్న అక్కినేని నాగ చైతన్య మహానుభావుడు లాంటి హిట్ ను అందుకున్న దర్శకుడు మారుతి తో సినిమాను చేయడానికి ఒకే చెప్పేశాడు. చిన్న కాన్సెప్ట్ ను తీసుకొని వినోదాత్మకంగా తెరకెక్కించడంలో మారుతి ఎంత ప్రతిభావంతుడో తెలిసిన విషయమే అయితే ఈ సారి మారుతీ తెరకెక్కించబోయే ఆ కొత్త కాన్సెప్ట్ లో చైతు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను ఇవ్వనున్నాడట.

ఈ కాంబినేషన్ లో రూపొందే సినిమా గురించి ఇప్పుడు ఒక టాక్ బయటకు వచ్చింది. పెళ్లి తర్వాత ప్రతిఒక్కరిలో కొన్ని ఈగోలు మొదలవుతూ ఉంటాయి. కొంతమంది సర్దుకుపోతే.. కొంతమంది వాటిని పీక్స్ లో చూపిస్తారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో మారుతిన కథను అల్లుతున్నడని.. చైతూ పెళ్లి తర్వాత ఈ సినిమాపై పూర్తి వివరాలను తెలియజేస్తారని కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం చైతు గోవాలో ఉన్నాడు. మరో రెండు రోజుల్లో పెళ్లి కొడుకు అవనున్నాడు. సమంత కూడా ఇప్పటినుండే రెడీ అవుతోంది.

ఇక ఆ పెళ్లి తర్వాత చైతు - చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యాసాచి సినిమా షూటింగ్ ను కంటిన్యూ చేస్తాడు. అలాగే కుదిరితే మారుతి సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురానున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ ఆ సినిమాను నిర్మించనుంది.