Begin typing your search above and press return to search.

వరుడు నాగ చైతన్య కావాల్సింది కాని మిస్‌

By:  Tupaki Desk   |   25 Oct 2021 11:30 PM GMT
వరుడు నాగ చైతన్య కావాల్సింది కాని మిస్‌
X
నాగ శౌర్య హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా సౌజన్య దర్శకత్వంలో రూపొందిన 'వరుడు కావలెను' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా రాబోతున్న ఈ సినిమా ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈమద్య కాలంలో ఈ నిర్మాణ సంస్థ పేరు మరియు ఈ నిర్మాత పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా భీమ్లా నాయక్ సినిమాను కూడా ఈయనే నిర్మిస్తున్న విషయం తెల్సిందే. కనుక సహజంగానే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. లక్ష్మీ సౌజన్య ఈ సినిమా కథను 2017 లోనే నిర్మాత చినబాబుకు చెప్పడం జరిగిందట. ఆ సమయంలో నాగ చైతన్యతో ఈ సినిమాను చేయాలని భావించిందట.

కథ అనుసారం హీరో చాలా డీసెంట్‌ గా.. చూడగానే వావ్‌ అనిపించే మ్యాన్లీ లుక్ లో ఉండాలని భావించిందట. అందుకే నాగ చైతన్యను తన మనసులో అనుకుందట. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది. నాగ చైతన్య ను అనుకున్నప్పటికి కుదరలేదు. అదే సమయంలో నాకు నాగ శౌర్య కూడా మైండ్‌ లో ఉన్నాడు. చైతూ తర్వాత వెంటనే నాకు మైండ్ లోకి వచ్చిన నాగ శౌర్య తో ఈ సినిమాను చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఈ సినిమా కథ చెప్పిన సమయంలో చినబాబు గారు చాలా ఎగ్జైట్‌ అయ్యారు. తప్పకుండా చేద్దామంటూ హామీ ఇచ్చారు. నాకు ఇంత కంటే బెస్ట్‌ డెబ్యూ దొరకదు. ఖచ్చితంగా ఈ సినిమా తో నాకు మంచి పేరు వస్తుందనే నమ్మకంను వ్యక్తం చేసింది.

ఈ సినిమా కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కు అని మాత్రమే కాదని.. యూత్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. హీరోయిన్ రీతూ వర్మ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంది. ఆమె ను చాలా కొత్తగా దర్శకురాలు చూపించడం జరిగింది. ఈ సినిమా పబ్లిసిటీని చాలా కొత్తగా చేస్తున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా ఎవరో తెలియని వారి పెళ్లి వేడుకకు వెళ్లి అక్కడ హడావుడి చేశారు. పెళ్లి వేడుకకు వెళ్లి అక్కడ కొత్త జంటతో ఫొటోలు దిగి వారిని సర్‌ ప్రైజ్ చేశారు. అలా రెండు మూడు పెళ్లిలను వరుడు కావలెను చిత్ర యూనిట్‌ సభ్యులు కవర్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ సినిమా తో నాగ శౌర్యకు మరో సక్సెస్ ఖాతాలో పడటం ఖాయం అన్నట్లుగా అంతా నమ్మకంతో ఉన్నారు.