Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో : ఏంటి చైతూ ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   11 Jan 2022 5:32 AM GMT
వైరల్‌ వీడియో : ఏంటి చైతూ ఏం జరుగుతోంది?
X
అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే సమంత తో బ్రేకప్‌ అయిన విషయం తెల్సిందే. విడాకుల ప్రకటన చేసిన తర్వాత ఇద్దరు కూడా వారి వారి జీవితాలతో బిజీ అయ్యారు. సోషల్‌ మీడియా మరియు షూటింగ్‌ లతో సమంత ఫుల్‌ బిజీ అయ్యింది. ఇదే సమయంలో ఆమె ట్రిప్‌ లు వేస్తూ స్నేహితులతో కలిసి చిల్‌ అవుతుంది. మరో వైపు నాగ చైతన్య వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. వాటి షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చైతూ బంగార్రాజు సినిమా ప్రమోషన్‌ లో ఉన్నాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న బంగార్రాజు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా నాగ చైతన్య వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ప్రెస్ మీట్ లకు హాజరు అవుతున్నాడు. ఇటీవల ఒక ప్రెస్ మీట్‌ లో నాగార్జునతో పాటు నాగ చైతన్య పాల్గొన్నాడు.

ఆ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ ఉండగా వెనుక ఉన్న నాగ చైతన్య మెల్లగా తన పక్కనే నిల్చుని ఉన్న హీరోయిన్‌ దక్ష నాగర్కర్ వైపు చూశాడు. చైతూ రొమాంటిక్‌ చూపుకు అంతే రొమాంటిక్ రెస్పాన్స్ ను దక్ష నాగర్కర్ ఇచ్చింది. చిన్నగా ఆమె కను బొమ్మలు ఎగరవేస్తూ చైతూ వైపు నవ్వుతూ చూడటం.. ఆ చూపుకు చైతూ సిగ్గుతో ముడుచుకు పోవడం అంతా వీడియోలో బందీ అయ్యింది. అది కాస్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ కొన్ని సెకన్ల వీడియోను నెటిజన్స్ రకరకాలుగా మీమ్స్ చేస్తుంటే మరి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మరి కొందరు ఏం చైతూ ఏం జరుగుతుంది.. దక్ష నాగర్కర్ తో పులిహోర కలుపుతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నాగ చైతన్య చాలా మొహమాటస్తుడు అనే విషయం తెల్సిందే. చాలా క్యాజువల్‌ గా ఆ సమయంలో వెనుక ఉన్న ఆమె వైపు చిన్నగా నవ్వుతూ చూడటం జరిగింది. అప్పుడు ఆమె రియాక్షన్‌ కు చిన్నపాటి షాక్ అయినట్లుగా చైతూ నవ్వడం జరిగింది తప్ప అంతకు మించి ఏమీ లేదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .దక్ష నాగర్కర్ బంగార్రాజు సినిమాలో ఐటెం సాంగ్‌ చేసింది. ఆమె సినిమాలో కనిపించేది కొద్ది సమయం మాత్రమే. అయినా కూడా సినిమా ప్రమోషన్‌ లో ఆమె భాగస్వామ్యం అయ్యింది.

ఇది కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. చిన్న పాత్రలో కనిపించిన దక్ష నాగర్కర్ ఎందుకు నీతో ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరు అవుతుందని అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలేం జరుగుతుంది చినబాబు అంటూ అక్కినేని అభిమానులు కూడా కొందరు సరదాగా ప్రశ్నిస్తున్నారు. ఏదో యాక్సిడెంటల్‌ గా జరిగిన ఆ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాను కుదిపేసేంత వైరల్‌ అవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వైరల్‌ వీడియోపై చైతూ లేదా దక్ష నాగర్కర్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.