Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఆర్టీసి బస్సెక్కిన మజిలీ టీమ్

By:  Tupaki Desk   |   31 Jan 2019 4:02 PM GMT
ఫోటో స్టొరీ: ఆర్టీసి బస్సెక్కిన మజిలీ టీమ్
X
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలి' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్ళైన తర్వాత చైతు-సమంతాలు కలిసి నటిస్తున్న చిత్రం కావడం.. పైగా ఇద్దరూ సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సమంతాతో మాత్రమే కాకుండా కాకుండా చైతు మరో హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ తో కూడా ప్రేమాయణం సాగిస్తాడట.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని సమాచారం. తాజాగా ఈ సినిమా నుండి ఒక ఆన్ లొకేషన్ స్టిల్ బయటకు వచ్చింది. ఈ ఫోటోలో నాగ చైతన్య.. దర్శకుడు శివ నిర్వాణ.. కమెడియన్ ప్రవీణ్ లతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఒక ఆర్టీసీ బస్ ఫుట్ బోర్డు మీద నిలబడి మరీ వారందరూ ఈ ఫోటోకు పోజిచ్చారు. గళ్ళ చొక్కా.. బ్లూ జీన్స్.. సాధారణమైన చెప్పులు వేసుకొని చేతిలో ఫోన్ పట్టుకున్న చైతు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలాగానే ఉన్నాడు. ఫోటోలో అందరూ ఒకరిని మించి మరొకరు చిరునవ్వులు చిందిస్తుండడం విశేషం.

ఈ చిత్రం ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి.. హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.