Begin typing your search above and press return to search.

పెళ్లిపీట లెక్కిన నాగ చైతన్య - సాయి పల్లవి.. అక్కినేని ఫ్యాన్స్​కు దీపావళి కానుక

By:  Tupaki Desk   |   14 Nov 2020 3:21 PM IST
పెళ్లిపీట లెక్కిన నాగ చైతన్య - సాయి పల్లవి..  అక్కినేని ఫ్యాన్స్​కు దీపావళి కానుక
X
కూల్​ అండ్​ సెన్సిబుల్​ దర్శకుడు శేఖర్​ కమ్ముల కొత్త చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిదాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సాయిపల్లవి.. లవర్​ బాయ్​ ఇమేజ్​ ఉన్న నాగచైతన్యతో ‘లవ్​స్టోరీ’ అనే సినిమాను శేఖర్​ కమ్ముల తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అదిరిపోయే కాంబో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఎంతో కష్టపడి ఈ సినిమాకు కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు. అన్ని అనుకున్నట్టు జరిగితే గత వేసవిలోనే సినిమా విడుదలయ్యేది. కానీ కరోనా లాక్​డౌన్​ దెబ్బకు సినిమా ఆగిపోయింది. చివరకు లాక్​డౌన్​ నిబంధనలు పూర్తయ్యాక షూటింగ్​ మొదలుపెట్టారు. ఇప్పటికే షూటింగ్​ అంతా పూర్తయినట్టు సమాచారం. కానీ ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్, పోస్టర్లు ఫుల్ వైరల్ అయ్యాయి.

తాజాగా దీపావళి సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కొత్త పోస్టర్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి పెళ్లి పీటలెక్కినట్టు కనిపిస్తోంది. అంటే సినిమాలోఈ ఇద్దరి కథ సుఖాంతం కానుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరి జంట మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని చెబుతూ నాగ చైతన్య ఈ కొత్త పోస్టర్‌ను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ మూవీని ఏసియన్ అధినేత సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. అక్కినేని ఫ్యాన్స్​ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్​ చేస్తారా? లేదంటే ఓటీటీలో రిజీజ్​ చేస్తారో వేచిచూడాలి. అయితే భారీ కాంబో కాబట్టి థియేటర్​లో రిలీజ్​ చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది.