Begin typing your search above and press return to search.

జూనియ‌ర్ బంగార్రాజులా మెరిసిన చై

By:  Tupaki Desk   |   23 Dec 2021 6:36 AM GMT
జూనియ‌ర్ బంగార్రాజులా మెరిసిన చై
X
బేబ‌మ్మ‌గా కుర్రాళ్ల గుండెల్లో నిదుర‌పోయింది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో సౌతిండియాలోనే మార్మోగిపోయింది త‌న పేరు. ఆ త‌ర్వాత వ‌రుసగా ప‌లు చిత్రాకు సంత‌కాలు చేసింది. ఇందులో బంగార్రాజు క్రేజీ ఆఫ‌ర్. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న అదిరే ఛాన్స్ దక్కించుకుంది. ఇక కృతితో చైతూ రొమాన్స్ ఏ రేంజులో పండబోతోందో శాంపిల్ వదిలింది టీమ్.

తాజాగా లీకైన పోస్ట‌ర్లో చైత‌న్య నిజంగానే జూ.బంగార్రాజునే త‌ల‌పిస్తున్నాడు. ఊరి పొలిమేర‌లో రాజు క్వాలిటీస్ అన్నీ అత‌డిలో ఉన్నాయి. విలేజీ బేబ‌మ్మ‌ల్ని ఆట‌ప‌ట్టించే రొమాంటిక్ రోమియోలా క‌నిపిస్తున్నాడు. అలా ప‌సుపు ప‌చ్చ కోక‌లో బేబ‌మ్మ కృతి స్టెప్పేస్తుంటే .. మెరుపుల మిరుమిట్ల చొక్కాయ్ ధ‌రించిన జూ. బంగార్రాజా అదిరే కానుక‌నే ఇస్తున్నాడు మ‌రి.

కృతి ప‌చ్చ బ్లౌజుకి చైతూ రెడ్ ష‌రాయికి బాగానే మ్యాచింగ్ కుదిరింది. అలా పంచె క‌ట్టి ద‌స‌రా బుల్లోడిని గుర్తు చేస్తున్నాడు చై. మొత్తానికి జంట అదిరింది. స్టెప్పు కుదిరింది. గుండె గుభేల్మంటోంది. బంగార్రాజు ఈ సీజ‌న్ లోనే విడుద‌ల‌కు దూసుకు రానుంది. నాగార్జున‌- ర‌మ్య‌కృష్ణ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న బంగార్రాజు లో నాగ‌చైత‌న్య -కృతి శెట్టి న‌డుమ అద్భుత‌మైన రొమాన్స్ పండ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల‌ రిలీజైన లిరిక‌ల్ వీడియో వైర‌ల్ గా దూసుకెళ్ల‌డానికి కార‌ణ‌మిదే.

బంగార్రాజు కాన్సెప్టే అదుర్స్:

టైమ్ ట్రావెల్ సినిమాలు చూశాం కానీ.. టైమ్ నే ఎద‌రించే హీరో సినిమాల్ని చూడ‌లేదు. అంత స్పీడ్ గా బంగార్రాజును చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. మేకర్స్ సమయంతో పోటీ పడుతున్నారు .. షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే మెజారిటీ పార్ట్ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవ‌ల‌ రాజమండ్రి.. మైసూర్ లో షూటింగ్ చేశారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ శరవేగంగా ప‌నిని పూర్తి చేస్తున్నారు. నాగార్జున న‌టించిన‌ హిట్ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్ అయిన ఈ చిత్రంలో నాగార్జున లుక్ సంథింగ్ హాట్ గా క‌నిపిస్తోంది. మ‌నం లాంటి క్లాసిక్ త‌ర్వాత నాగార్జున‌- నాగ‌చైత‌న్య కాంబినేష‌న్ రిపీట‌వుతుండ‌డంతో అక్కినేని అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నారు. తెర‌పై మ‌రోసారి ఆ ఇద్ద‌రి న‌డుమా స‌న్నివేశాలు ఏ రేంజులో పండ‌నున్నాయో చూడాల‌న్న ఆస‌క్తి ఉంది.