Begin typing your search above and press return to search.

అమీర్ సెట్స్ లో అడుగు పెట్ట‌బోతున్న అక్కినేని

By:  Tupaki Desk   |   24 Jun 2021 9:30 AM GMT
అమీర్ సెట్స్ లో అడుగు పెట్ట‌బోతున్న అక్కినేని
X
నిన్నామొన్న‌టి వ‌ర‌కు సొంత ఇండ‌స్ట్రీ మీద‌నే ఫోక‌స్ పెట్టేవారు సౌత్ హీరోలు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. నేష‌న‌ల్ లెవెల్లో ఫేమ‌స్ అయ్యేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మార్కెట్ ను పెంచుకోవ‌డం.. త‌ద్వారా రెమ్యున‌రేష‌న్ పెంచుకోవ‌డంతోపాటు.. దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవ‌డం అనే మూడు టార్గెట్ల‌ను పెట్టుకొని ఫ్యూచ‌ర్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు.

టాలీవుడ్లో టాప్ హీరోలుగా ఉన్న‌వారంతా.. అప్ క‌మింగ్ మూవీస్ ను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తుండ‌డం కూడా ఇందులో భాగ‌మే. ఈ విధంగా సౌత్ లోని ఇత‌ర ఇండ‌స్ట్రీల‌తోపాటు బాలీవుడ్ లోనూ జెండా పాతేందుకు ట్రై చేస్తున్నారు. అయితే.. అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య నేరుగా బాలీవుడ్ లోనే అడుగు పెడుతుండ‌డం విశేషం.

మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో కలిసి చైతూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. అమీర్ అప్ క‌మింగ్ మూవీ ‘లాల్ సింగ్ చ‌ద్దా’లో కీలక పాత్ర పోషిస్తున్న చైతూ.. జులైలో సెట్స్ లో అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే షూటింగులకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై ఫస్ట్ వీక్ లో అమీర్‌తో కలిసి షూట్ లో పాల్గొనబోతున్నాడు చైతూ.

ఈ షూట్ కోసం బ‌ల్క్ డేట్స్ కేటాయించాల‌ని చైతూను అమీర్ ఖాన్ కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీలో నాగ చైత‌న్య‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తారని టాక్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ చూడ‌ని ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో చైతూ క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. మరి, అక్కినేని వారబ్బాయి బాలీవుడ్లో ఎలాంటి ఫీట్ నమోదు చేస్తాడో చూడాలి.

కాగా.. తెలుగులో నాగ చైత‌న్య రెండు ప్రాజెక్టులో లైన్లో ఉన్నాయి. ఫీల్ గుడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీని తర్వాత ‘థాంక్యూ’ చిత్రం కూడా రాబోతోంది.