Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ - చైతు సినిమా ఉందంటున్నారే!

By:  Tupaki Desk   |   30 April 2020 2:40 PM IST
త్రివిక్రమ్ - చైతు సినిమా ఉందంటున్నారే!
X
కొన్ని వార్తలు మొదటి సారి విన్నప్పుడు జస్ట్ గాసిప్పేమో అనుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత అదే నిజమని అంటారు. తాజాగా నాగ చైతన్య ప్రాజెక్టు విషయంలో అలాంటిదే జరిగిందని అంటున్నారు. త్రివిక్రమ్ - నాని - నాగ చైతన్య కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని ఈ మధ్య గుసగుసలు వినిపించాయి. అయితే ఈ కాంబినేషణ్ వీలు కాదని చాలా మంది కొట్టి పారేశారు.

ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చెయ్యడం లేదు. నాని నటించడం లేదు. త్రివిక్రమ్.. నాని ఇద్దరూ నిర్మాతలు గా ఉంటారు. త్రివిక్రమ్ తరఫున హారిక హాసిని వారు ఇన్వెస్ట్ చేస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పవర్ స్టార్ సమర్పిస్తారట. ఈ సినిమాకు దశరథ్ కథ తయారు చేశాడని సమాచారం. అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందట. ఈ సినిమా ముగ్గురు అన్నదమ్ముల మధ్య సాగే కథ అని.. చైతు తో పాటుగా మరో హీరోకు కూడా అవకాశం ఉందని అంటున్నారు.

నాగ చైతన్య ఈమధ్య చాలా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. చూస్తుంటే ఇది కూడా మరో క్రేజీ ప్రాజెక్టుగా మారేలా ఉంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు.. చైతు తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోయే మరో హీరో ఎవరు అనే వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని అంటున్నారు.