Begin typing your search above and press return to search.
అఖిల్ కు సపోర్ట్ గా నాగ చైతన్య..!
By: Tupaki Desk | 6 Oct 2021 11:00 AM ISTయూత్ కింగ్ అఖిల్ అక్కినేని - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్''. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. 'భలే భలే మగాడివోయ్' 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు.. మరో నిర్మాత, ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది.
దసరా కానుకగా ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరపరిచిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యే వ్రాప్ అప్ పార్టీ నిర్వహించి ప్రేక్షకులను నవ్వించారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి చిత్ర యూనిట్ రెడీ అయింది.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీ రిలీజ్ వేడుక అక్టోబర్ 8న JRC కన్వెన్షన్ హాల్లో జరగనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అఖిల్ సోదరుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రానున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ ను దర్శక నిర్మాతలు విడుదల చేసారు. 'లవ్ స్టోరీ' సినిమాతో మ్యాజికల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చైతన్య.. ఇప్పుడు తమ్ముడు అఖిల్ కు తనవంతు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు.
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాని రూపొందించారు. తన చిత్రాల్లోని పాత్రల్ని క్యూట్ రొమాన్స్ తో లవ్ లీగా డిజైన్ చేసే భాస్కర్.. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ తో ఈ విషయం అర్థమవుతుంది. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ఇప్పటికే 7.9 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రంలో ఆమని - ఈషా రెబ్బా - ఫారియా అబ్దుల్లా - చిన్మయి - వెన్నెల కిషోర్ - మురళీశర్మ - జయప్రకాష్ - అజయ్ - ప్రగతి - అమిత్ తివారి - పోసాని కృష్ణ మురళి - సుడిగాలి సుధీర్ - గెటప్ శ్రీను - అభయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రదీశ్ ఎమ్ వర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తండ్ కే వెంకటేశ్ దీనికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.