Begin typing your search above and press return to search.
#డాన్ లుక్.. నాగచైతన్య స్టైలిష్ మేకోవర్
By: Tupaki Desk | 3 Jun 2021 9:00 PM IST`బిజినెస్ మేన్` సినిమాలో ఈ ముంబైని పోయించడానికి వచ్చానని సూపర్ స్టార్ మహేష్ చెప్పే డైలాగ్ ని మర్చిపోలేం. చూడటానికి చాక్లెట్ బోయ్ లా ఉన్నాడు ఈయనేం పోయిస్తాడు! అంటూ సిటీ కమీషనర్ నాజర్ తో సాటి పోలీస్ అనబోతే.. డాన్ `దావూద్ ఇబ్రహీం` చాక్లెట్ బోయ్ లా లేడా.. ? అని సీరియస్ అవుతారు.
చూస్తుంటే ఇప్పుడు నాగచైతన్య కూడా డాన్ లానే కనిపిస్తున్నాడు. స్టైలిష్ డాన్ లా దావూద్ లానే కనిపిస్తున్నాడు. అతడి మేకోవర్ ఇంపాక్ట్ అది. మునుపటితో పోలిస్తే గడ్డంతో కాస్త రగ్గ్ డ్ గానే కనిపిస్తున్నాడు. స్టైల్ గా ఫిట్ గా డాన్ లా ఉన్నాడు. ఫార్మల్ షర్ట్ పై బ్లాక్ కోట్ ధరించి బ్లాక్ గాగుల్స్ తో కుర్రకారులో ట్రెండీ టాపిక్ అయ్యాడు.
ఈ లుక్ విక్రమ్.కె.కుమార్ తెరకెక్కిస్తున్న థాంక్యూ మూవీ కోసం. మనం తర్వాత ఈ జోడీ ప్రయోగాత్మక చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. థాంక్యూలో చైతూ పాత్ర చిత్రణ ఎలా ఉండనుందో వేచి చూడాలి. ఈ చిత్రంలో చైతూ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాడట. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా చైతూ గడ్డంతో ఉన్న లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఇందులో క్లీన్ సేవ్ లుక్ లోనూ కనిపిస్తాడని సమాచారం.