Begin typing your search above and press return to search.

చైతూ నో చెప్పినా చైతూ హీరోయిన్‌ ఓకే చెప్పింది

By:  Tupaki Desk   |   21 July 2020 7:00 AM IST
చైతూ నో చెప్పినా చైతూ హీరోయిన్‌ ఓకే చెప్పింది
X
శర్వానంద్‌ హీరోగా ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే చిత్రం తెరకెక్కబోతుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. స్క్రిప్ట్‌ వర్క్‌ చాలా కాలం క్రితమే దర్శకుడు పూర్తి చేశాడు. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం విడుదల అయిన కొన్నాళ్లకే దర్శకుడు అజయ్‌ భూపతి మహాసముద్రం చిత్రాన్ని చేయాలని ప్రయత్నాలు చేశాడు. సినిమా కథను మొదట రవితేజ ఓకే చేసి ఆ తర్వాత నో అన్నాడనే వార్తలు వచ్చాయి. నాగచైతన్య కూడా ఇంట్రెస్ట్‌ చూపించినా కొన్ని కారణాల వల్ల చేయలేక పోతున్నట్లుగా పేర్కొన్నాడనే ప్రచారం జరిగింది.

సుదీర్ఘ చర్చల తర్వాత ఈ చిత్రంలో నటించేందుకు శర్వానంద్‌ ఒప్పుకున్నాడు. షూటింగ్‌ కు వెళ్లేందుకు రెడీ అవుతున్న సమయంలో అనూహ్యంగా కరోనా వైరస్‌ వల్ల క్యాన్సిల్‌ అయ్యింది. త్వరలో షూటింగ్‌ ప్రారంభించే ఉద్దేశ్యంతో దర్శకుడు అజయ్‌ హీరోయిన్‌ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడు. పలువురు హీరోయిన్స్‌ ను పరిశీలించిన దర్శకుడు సాయి పల్లవితో చేయాలని తీవ్రంగా ప్రయత్నించాడు. శర్వాతో ఆమె చేసేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా ముందే కమిట్‌ అయ్యి ఉన్న ప్రాజెక్ట్‌ కారణంగా సారీ చెప్పిందట. దాంతో ‘మజిలీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దివ్యాంశ కౌశిక్‌ ను అజయ్‌ సంప్రదించాడట.

మజిలీ చిత్రం సక్సెస్‌ అయినా కూడా ఆ చిత్రంలో దివ్యాంశ పోషించిన పాత్ర చిన్నది అవ్వడం వల్ల ఆమెకు గుర్తింపు రాలేదు. ఇప్పుడు దివ్యాంశ కౌశిక్‌ కు మహాసముద్రంలో ఛాన్స్‌ రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. నాగచైతన్యతో నటించి లక్‌ తెచ్చుకోలేక పోయిన ఈమెకు శర్వా అయినా టాలీవుడ్‌ లో గుర్తింపు దక్కించుకునేలా లక్‌ ఇస్తాడా అనేది చూడాలి. కరోనా పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు.