Begin typing your search above and press return to search.

'యుద్ధం శరణం' లో బాహుబలి

By:  Tupaki Desk   |   22 Aug 2017 12:14 PM IST
యుద్ధం శరణం లో బాహుబలి
X
బాహుబలి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతర భాషల వారు కూడా బాహుబలి గురించి మాట్లాడుకుంటే ఎదో ఒక సందర్భంలో టాలీవుడ్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. అయితే హిందీ-తమిళ్ వంటి ఇతర సినిమా ఇండస్ట్రీలో కూడా అప్పుడప్పుడు బాహుబలి మ్యానియా ను సినిమాల్లో మరియు రియాలిటీ షోల్లో వాడుకుంటున్నారు. మరి వాళ్లే అంతలా వాడుకుంటుంటే మన సినిమాను మనవాళ్ళు ఎంత వాడుకోవాలి.

ఇప్పటికే కొన్ని సినిమాల్లో బాహుబలి క్యారెక్టర్స్ ని మరియు షూటింగ్స్ స్పాట్స్ ని మనవాళ్ళు తెగ వాడేసుకున్నారు. ముఖ్యంగా నాని కూడా "మజ్ను" సినిమాలో ఏకంగా రాజమౌళి ని వాడేసుకొని ఆయన అసిస్టెంట్ గా సినిమాలో కనిపించాడు హీరో. ఇప్పుడు అదే తరహాలో బాహుబలి షూటింగ్స్ ని అక్కినేని హీరో నాగ చైతన్య వాడేసుకుంటున్నాడు. వచ్చే నెల 8న రిలీజ్ కాబోయే "యుద్దం శరణం" సినిమాలో చైతు బాహాబలి కి పనిచేసే డ్రోన్‌ ఆపరేటర్‌ గా కనిపించబోతున్నాడట. సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ బాహుబలి సెట్ లోనే స్టార్ట్ అవ్వనుందని టాక్.

ఇక ఈ ఐడియని రాజమౌళి తనయుడు ఎస్.ఎస్ కార్తికేయ ఇచ్చాడట. అతను ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఇక యుద్ధ శరణం సినిమా వచ్చే నెలలో భారీ ఎత్తున వారాహి ప్రొడక్షన్ లో సాయి కొర్రపాటి రిలీజ్ చేయనున్నారు. తమిళ దర్శకుడు కృష్ణ ఆర్‌.వి. మరిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో చైతు సరసన లావణ్యా త్రిపాఠి హీరోయిన్‌ గా నటిస్తుండగా శ్రీకాంత్‌ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.