Begin typing your search above and press return to search.

భార్య‌ను ఫాలో చేస్తున్న చైతూ

By:  Tupaki Desk   |   5 March 2020 9:00 PM IST
భార్య‌ను ఫాలో చేస్తున్న చైతూ
X
ప్రస్తుతం డిజిట‌ల్ -ఓటీటీ హ‌వా సాగుతోంది. ఇప్ప‌టికే మాధ‌వ‌న్ `బ్రీత్`.. మ‌నోజ్ భాజ్ పాయ్ `ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ లు ఘ‌న‌విజయం సాధించ‌డంతో ఈ త‌ర‌హాలో వెబ్ సిరీస్ ల వెల్లువ పెరిగింది. అటు హిందీ స‌హా ఇటు తెలుగు- త‌మిళంలోనూ వెబ్ సిరీస్ ల వెల్లువ ప‌రాకాష్ట‌లో ఉంది.

ఇప్ప‌టికిప్పుడు తెలుగులో డ‌జ‌ను పైగానే వెబ్ సిరీస్ లు సెట్స్ పై ఉన్నాయి. అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ నిరంత‌రాయం గా వెబ్ సిరీస్ లు చేస్తున్నాయి. ఇక అక్కినేని కోడ‌లు స‌మంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సిరీస్ ఎయిర్ కానుంది. ఈలోగానే అక్కినేని నాగ‌చైత‌న్య వెబ్ సిరీస్ లో న‌టించేందుకు ఆసక్తిగా ఉన్నార‌న్న వార్త అక్కినేని ఫ్యాన్స్ ని వేడెక్కిస్తోంది.

చైతూకి ఇటీవ‌లే మ‌నం ఫేం విక్ర‌మ్.కె.కుమార్ ఓ వెబ్ సిరీస్ స్క్రిప్టును వినిపించాడ‌ట‌. ఐడియా బావుంది .. చేసేద్దాం అంటూ చైతూ క‌మిట‌య్యాడ‌ని ప్ర‌స్తుతం విక్ర‌మ్.కె ఆ ప‌నిలోనే ఉన్నాడ‌ని చెబుతున్నారు. 10 ఎపిసోడ్ల‌తో క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో వెబ్ సిరీస్ ని నిర్మించేందుకు ప్రైమ్ వీడియో తో ఇప్ప‌టికే ఒప్పందం కుదిరింద‌ట‌. ఇక 13 బి- మ‌నం- 24 లాంటి విల‌క్ష‌ణ చిత్రాల్ని తెర‌కెక్కించిన విక్ర‌మ్.కె వెబ్ సిరీస్ ల‌తో స‌త్తా చాటాల‌న్న ప్లాన్ లో ఉన్నాడు. కార‌ణం ఏదైనా సౌత్ లో వెబ్ సిరీస్ చేస్తున్న తొలి స్టార్ హీరోగా నాగ‌ చైత‌న్య పేరు మార్మోగ‌నుంది. ఇక క‌ళ్యాణ్ రామ్ స‌హా ప‌లువురు స్టార్లు వెబ్ సిరీస్ ఆలోచ‌న చేస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్ కు సొంత ప్రొడ‌క్ష‌న్ లో నిర్మించే ప్లాన్ ఉంది. మ‌రోవైపు అల్లు ఆహాతో పాటు దిల్ రాజు-సురేష్ బాబు ఓటీటీ వేదిక‌లు సిద్ధ‌మ‌వుతుండ‌డం తో వెబ్ సిరీస్ దిశ‌గా ప‌లువురు స్టార్లు ఆలోచించేందుకు ఆస్కారం లేక‌పో లేద‌ని అంచ‌నా వేస్తున్నారు.