Begin typing your search above and press return to search.

మామ మాసు అల్లుడు క్లాసు

By:  Tupaki Desk   |   10 Sep 2018 12:34 PM GMT
మామ మాసు అల్లుడు క్లాసు
X
అక్కినేని దగ్గుబాటి కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభిమానుల కోరికను నెరవేరుస్తూ నాగ చైతన్య వెంకటేష్ తొలిసారిగా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ మామ టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. జై లవకుశ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని దర్శకుడు బాబీ దీన్ని రూపొందిస్తున్నాడు. సురేష్ బ్యానర్ తో పాటు కోన కార్పొరేషన్ కూడా టై అప్ అయిన ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమయ్యింది కానీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. చైతు శైలజారెడ్డి ప్రమోషన్ లో బిజీగా ఉండగా వెంకటేష్ ఎఫ్2 షెడ్యూల్స్ లో తలమునకలై ఉన్నాడు. ఇవి పూర్తవ్వగానే వెంకీ మామా సెట్స్ పైకి వెళ్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో వెంకటేష్ మంచి కామెడీ టచ్ ఉండే పల్లెటూరి మావయ్య పాత్రలో కనిపిస్తే చైతు క్లాస్ టచ్ ఉన్న సిటీ అబ్బాయిగా రొమాంటిక్ గా కనిపిస్తాడని తెలిసింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సీన్ లు ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు.

చాలా వెరైటీగా అనిపించే ఈ లైన్ తెరమీద నవ్వుల్నీ పండించడం ఖాయంగా కనిపిస్తోంది. వినిపించిన టాక్ ప్రకారం ఇందులో వెంకటేష్ స్వంత ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఎప్పుడో చిన్నప్పుడే దూరమైన తన చెల్లి మేనల్లుడి గురించి జాడ తెలియక కాలం గడుపుతున్న సమయంలో వాళ్ళ ఉనికి తెలుస్తుందట. దాంతో నగరానికి వచ్చిన వెంకీ చైతు ఒకరికి ఒకరు ఎవరో తెలియకుండానే కలుసుకోవడం ఇలా మంచి రసపట్టులో కథ సాగుతుందట. ఇదే లైన్ అని ఖచ్చితంగా నిర్ధారించలేం కానీ మొత్తానికి బయటికి వచ్చిన న్యూస్ అయితే ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. వెంకటేష్ నాగార్జున కాంబినేషన్ చూడలేకపోయిన ఫ్యాన్స్ ఎట్టకేలకు వెంకీ చైతులను చూసుకోవడం పట్ల హ్యాపీగా ఉన్నారు. అక్టోబర్ నుంచి షూటింగ్ ఊపందుకోబోతోంది.