Begin typing your search above and press return to search.

ఏమో అనుకున్నాం కానీ శ్రుతీ..

By:  Tupaki Desk   |   10 Dec 2015 11:30 AM GMT
ఏమో అనుకున్నాం కానీ శ్రుతీ..
X
మలయాళ ప్రేమమ్ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా కొందరు చూసే ఉంటారు. కుర్రాళ్లంతా అందులోని ముగ్గురు హీరోయిన్లతో ప్రేమలో పడిపోయి ఉంటారు. అందులోనూ ముఖ్యంగా మలర్ పాత్రలో నటించిన సాయి పల్లవికి ఫ్లాట్ అయిపోని వారు లేరు. స్టూడెంటుని ప్రేమలో పడేసి.. తనూ ప్రేమలో పడిపోయే కాలేజీ లెక్చరర్ పాత్రలో సాయిపల్లవి పెర్ఫామెన్స్ అదిరిపోయింది. ఆమె అందం - అభినయం అన్నీ కూడా చాలా ఫ్రెష్ గా అనిపించాయి ప్రేక్షకులకు. ఓ కొత్తమ్మాయిని ఈ పాత్రకు ఎంచుకోవడం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఫ్రెష్ ఫేస్ వల్ల సినిమాకు కూడా ఫ్రెష్ లుక్ వచ్చింది.

ఐతే ప్రేమమ్ తెలుగు రీమేక్ ‘మజ్ను’లో ఈ పాత్రకు చాలామంది హీరోయిన్లను పరిశీలించి చివరికి స్టార్ ఇమేజ్ ఉన్న శ్రుతి హాసన్ ను తీసుకునేసరికి ‘ప్రేమమ్’ చూసిన జనాలకు అదోలా అనిపించింది. అక్కడ కొత్తమ్మాయి పోషించిన పాత్రకు ఇక్కడ స్టార్ ఇమేజ్ ఉన్న శ్రుతి సూటవుతుందా అన్న సందేహాలు కలిగాయి. ఐతే ‘మజ్ను’ షూటింగ్ స్పాట్ నుంచి లీకైన పిక్స్ లో శ్రుతిని చూస్తుంటే మాత్రం ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోతున్నాయి. మేకప్ లేకుండా.. కాటన్ చీరల్లో సహజమైన అందంతో కనిపిస్తున్న శ్రుతి ఇట్టే జనాల్ని ఆకట్టుకుంటోంది. ఆ పిక్స్ చూడగానే శ్రుతి కూడా మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు చైతూ లుక్ కూడా సూపర్బ్ అనిపిస్తోంది. వీళ్ల లుక్స్ చూస్తుంటేనే ‘ప్రేమమ్’ మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడంలో యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి బాగానే సక్సెస్ అవుతున్నట్లు అనిపిస్తోంది.