Begin typing your search above and press return to search.

అక్కినేని వారి లగ్న పత్రిక

By:  Tupaki Desk   |   11 Aug 2017 9:39 AM IST
అక్కినేని వారి లగ్న పత్రిక
X
ఆమెకు మొదటి సినిమా..అతనికి మొదట విజయాన్ని ఇచ్చిన సినిమా.. ఏ మాయ చేసావే. ఏ సమయాన ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారో గాని ఆ మొదటి సినిమా బంధం పెళ్లి పీఠల వరకు రానే వచ్చింది. అక్కినేని నాగ చైతన్య - సమంత ల నిశ్చితార్ధం జరిగి నెలలు కావొస్తున్న ఈ టాలీవుడ్ లవర్స్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అన్న ప్రశ్నలకు మరి కొద్ది రోజుల్లో తెర పడనుంది.

గత కాలంగా ప్రేమలో మునిగి తెలుతున్న సమంత-చైతు వారి ఇరువురి సాంప్రదాయాలను గౌరవించి.హిందు -క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకోనున్నారు. అందుకు పెళ్లి పత్రికను కూడా రెడీ చేశారు అక్కినేని నాగార్జున. వచ్చే నెల అనగా అక్టోబర్ 6 మరియు 7 తేదీల్లో ఇరు సాంప్రదాయాల్లో రెండు సార్లు పెళ్లి చేసుకోబోతోంది ఈ యువ జంట. ఈ వివాహ వేడుక గోవా వగటర్ బీచ్ సమీపాన ఉన్న W హోటల్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

అంతే కాకుండా ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు మరి కొంతమంది ప్రముఖుల్ని మాత్రమే ఆహ్వానించారట నాగార్జున. అందుకోసం వారికి ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ కార్డ్స్ రెడి చేస్తున్నారట. ఇక పెళ్లి ముగిసిన తర్వాత హైదరాబాద్ లో రిసిప్షన్ నిర్వహించి అందరి సన్నిహితుల్ని సినీ ప్రముఖులను పిలిచి పార్టీ ఇస్తారట నాగార్జున. ఇక ప్రస్తుతం నాగ చైతన్య -సమంత షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. పెళ్లికి ఎక్కువ సమయం లేకపోవడంతో మరి కొన్ని రోజుల్లో షూటింగ్స్ ని కంప్లిట్ చేసుకొని పెళ్లికి సిద్ధమవుతున్నారట ఈ యువ జంట.