Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: చిల్లింగ్ క్లైమేట్ చై-సామ్ చిల్ అవుట్

By:  Tupaki Desk   |   7 Jan 2019 10:05 AM GMT
ఫోటో స్టొరీ: చిల్లింగ్ క్లైమేట్ చై-సామ్ చిల్ అవుట్
X
టాలీవుడ్ క్యూట్ కపుల్ అక్కినేని నాగ చైతన్య-సమంతా ప్రస్తుతం విదేశాలలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ నగరంలో ఫుల్ గా చిల్ అవుట్ అవుతూ ఉన్న ఫోటోలను సమంతా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ అభిమానులకు అప్డేట్ ఇచ్చేసింది సమంతా.

ఈ సీజన్ లో అక్కడ టెంపరేచర్ మ్యాగ్జిమమ్ 9 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటదు. అదే మినిమమ్ అయితే 1 డిగ్రీ నుండి 4 డిగ్రీ వరకూ ఉంటుంది. అంటే రొమాంటిక్ కపుల్ చిల్ అవుట్ అయ్యేందుకు సూటబుల్ గా ఉండే చిల్లింగ్ క్లైమేట్ అన్నమాట. అందుకే ఫుల్ గా కవర్ చేసుకున్న వింటర్ వింటర్ వేర్లో చైతును చేయిని గట్టిగా పట్టుకుని ఫోటోకు పోజిచ్చింది సమంతా. ఈ ఫోటోకు "భారీ అంచనాలతో 2019 లోకి అడుగుపెడుతున్నాం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇద్దరూ భార్యాభర్తల లాగా కాకుండా లవర్ కపుల్ లా ఉన్నారు. అందుకేనేమో.. ఈ ఫోటోకు నెటిజనుల స్పందన సూపర్ గా ఉంది.. పోస్ట్ చేసిన 24 గంటలలోపే 5.73 లక్షల లైక్స్ వచ్చాయి.

సినిమాల విషయానికి వస్తే ఈ అక్కినేని జంట శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలి' అనే సినిమాలో నటిస్తోంది. పెళ్ళికి ముందు హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట పెళ్ళైన తర్వాత నటించే మొదటి చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. చిత్రమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఇద్దరూ భార్య భర్తలుగా నటిస్తున్నారు!