Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 16న వస్తున్న నాగచైతన్య 'లవ్ స్టోరీ'..!

By:  Tupaki Desk   |   25 Jan 2021 10:48 PM IST
ఏప్రిల్ 16న వస్తున్న నాగచైతన్య లవ్ స్టోరీ..!
X
యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య - నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''లవ్ స్టోరీ''. ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తూ సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు 'ఏయ్ పిల్లా' సాంగ్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవల వచ్చిన లవ్ స్టొరీ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో అందమైన ప్రేమ కావ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

ఈ సందర్భంగా 'లవ్ స్టొరీ' నుంచి ఓ లవ్ లీ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందమైన జోడీ నాగ చైతన్య - సాయి పల్లవి గాలి పటం ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. రాబోయే హాట్ సమ్మర్ లో ప్రేక్షకులకు కూల్ లవ్ స్టోరీని అందిస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే లవ్ స్టొరీ చిత్రంలో రాజీవ్ కనకాల - ఈశ్వరీరావు - దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సి.హెచ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణదాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.