Begin typing your search above and press return to search.

పిక్ టాక్: బబ్లీ బ్యూటీ కౌగిలిలో చిక్కుకున్న అక్కినేని అందగాడు..!

By:  Tupaki Desk   |   18 May 2021 4:04 PM IST
పిక్ టాక్: బబ్లీ బ్యూటీ కౌగిలిలో చిక్కుకున్న అక్కినేని అందగాడు..!
X
'మనం' వంటి క్లాసిక్ తర్వాత అక్కినేని నాగచైతన్య - డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ''థాంక్యూ''. రాశీ ఖన్నా - మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలలో అవికా గోర్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కోవిడ్ నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఇటలీ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

ఇందులో నాగచైతన్య - రాశీఖన్నా కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గార్డెన్ లో కూర్చొని చైతన్య లాప్ టాప్ లో వర్క్ చేసుకుంటుండగా.. రాశీ వెనకనుంచి చై ని గట్టిగా కౌగిలించుకుని ఉంది. చైతన్య - రాశీ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా 'థాంక్యూ'. ఇంతకముందు 'మనం' 'వెంకీ మామ' సినిమాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలో మరో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.

కాగా, 'థాంక్యూ' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్‌ రాజు - శిరీష్‌ - హ‌ర్షిత్ రెడ్డి లు కలిసి నిర్మిస్తున్నారు. బీవీఎస్‌ రవి ఈ చిత్రానికి స్టోరీ అందించడంతో పాటు డైలాగ్స్ రాస్తున్నారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.