Begin typing your search above and press return to search.

థాంక్యూ ఎఫెక్ట్‌... ఆ సినిమా అటకెక్కేనా?

By:  Tupaki Desk   |   24 July 2022 6:39 AM GMT
థాంక్యూ ఎఫెక్ట్‌... ఆ సినిమా అటకెక్కేనా?
X
నాగ చైతన్య థాంక్యూ సినిమా అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. మొదటి రోజు వసూళ్లు చూస్తూ ఉంటే బ్రేక్ ఈవెన్‌ దాదాపు అసాధ్యం అన్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్య ఈ కథ ఎంపిక విషయంలో తప్పటడుగు వేశాడని రివ్యూలు వచ్చాయి. థాంక్యూ ఒక పాఠం గా చైతూ తదుపరి సినిమాలు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

థాంక్యూ పాఠం తో నాగ చైతన్య ఇప్పటికే కమిట్‌ అయిన పరశురామ్‌ సినిమా విషయంలో ఆలోచనలో పడుతాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. థాంక్యూ సినిమా యొక్క ఫలితం కారణంగా పరశురామ్‌ కు కష్టాలు తప్పేలా లేవు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మీడియా సర్కిల్స్ లో కూడా చైతూ పరశురామ్‌ ల కాంబో మూవీ పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నాగ చైతన్య మరియు పరశురామ్ ల కాంబోలో సినిమా రెండేళ్ల క్రితం రావాల్సి ఉంది. వీరి కాంబో సినిమా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మహేష్ బాబు నుండి పిలుపు రావడంతో పరశురామ్‌ సర్కారు వారి పాట సినిమా కోసం వెళ్లాడు. ఆ సినిమా తర్వాత వీరి కాంబోలో సినిమా చేయాల్సి ఉన్నా... వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య మూవీ మొదలు అయ్యింది.

వెంకట్‌ ప్రభు సినిమా పూర్తి అయిన తర్వాత లేదంటే త్వరలోనే పరశురామ్‌ దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా మొదలు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న సమయంలో థాంక్యూ ఫలితంతో పరశురామ్‌ కథపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. థాంక్యూ సినిమా కథ మాదిరిగానే రెగ్యులర్‌ ఫక్త్‌ కమర్షియల్‌ కథనే పరశురామ్‌ రెడీ చేశాడట.

ఇప్పుడు ఆ కథతో సినిమా చేస్తే మళ్లీ థాంక్యూ ఫలితం పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది నాగ చైతన్య సన్నిహితుల అభిప్రాయమట. అందుకే నాగ చైతన్య ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. నాగ చైతన్య మరియు పరశురామ్‌ కాంబో సినిమా గురించి వస్తున్న పుకార్లకు ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరి వారు స్పందిస్తారా అనేది చూడాలి.