Begin typing your search above and press return to search.

మహానటిలో వాళ్లిద్దరూ.. తుపాకీ ఐడియానే

By:  Tupaki Desk   |   27 Sept 2016 9:45 AM IST
మహానటిలో వాళ్లిద్దరూ.. తుపాకీ ఐడియానే
X
ఎప్పటి నుండో మాహానటి సావిత్రి జీవితాన్ని ఒక సినిమాగా తీస్తే బాగుంటుందని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ్ అశ్విన్ తన మామగారు అశ్వినీ దత్ ప్రొడక్షన్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారనగానే.. అందరికీ క్యురియాసిటి పెరిగింది. అయితే ఈ సినిమాలో నిజజీవితపు ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ పాత్రలు తక్కువసేపే కనిపించినా కూడా.. ఖచ్చితంగా వాటి తాలూకు ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంటుందని అందరికీ తెలిసిందే.

ఇదే విషయాన్ని గతంలో ప్రస్తావించిన తుపాకి.కామ్... అసలు ఈ పాత్రలకు ఎంతటి గొప్ప యంగ్ నటులను ఎంపిక చేసినా కూడా.. జూ.ఎన్టీఆర్ అండ్ నాగ చైతన్యలతో ఆ పాత్రలను చేయిస్తే వచ్చేంత కిక్ మాత్రం రాదని ఒక ఐడియా వదిలింది. ఎందుకంటే స్వయంగా ఆ మహానటుల వారసులే సదరు పాత్రను చేస్తున్నారంటే ఆడియన్స్ కూడా బాగా కనక్ట్ అయిపోతారు. ఇకపోతే తుపాకి ఇచ్చిన ఐడియా నచ్చేయడంతో కాబోలు.. ఇప్పుడు నాగ్ అశ్విన్ నిజంగానే ఎన్టీఆర్ అండ్ చైతూలను ఎప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అయితే వారు మాత్రం సదరు పాత్రలు చేయడానికి సుముఖత ఉందీ లేనిదీ చెప్పలేదట. కాస్త టైమ్ అడిగారట.

ఏదేమైనా కూడా మహానటి సావిత్రి సినిమా అంటే ఎంత ఎక్సయిటింగ్ గా ఉంటుందో.. ఆమె ఆఖరి రోజుల తాలూకు పెయిన్ చూడాల్సి వస్తుందేమోనని అందరికీ అంతే బాధగా కూడా ఉంది. చూద్దాం ఈ సినిమా ఏ విధంగా రూపుదిద్దుకుని అందరినీ అలరిస్తుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/